మేనిఫెస్టో రూపొందించి బాండ్ పేపర్ పై సంతకం పెట్టే పాలసీ ప్రతి గ్రామంలో తీసుకురండి

On
మేనిఫెస్టో రూపొందించి బాండ్ పేపర్ పై సంతకం పెట్టే పాలసీ ప్రతి గ్రామంలో తీసుకురండి

ఏ ఒక్క అభ్యర్థిని వదిలి పెట్టొద్దు గెలిచినా,ఓడినా చట్ట పరిధిలో అయ్యే సమస్యలు పరిష్కరించాలని నిలదీయండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఆదివాసి ఎమ్మెల్యే అభ్యర్థి, లాయర్ ఊకె రవి గెలుపు కోరుతూ ఆదివాసి సేన ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెం, కేసప్పగూడెం,కొత్తూరు, నల్లబాడు తదితర గ్రామాలలో గెలుపు కోరుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ మేనిఫెస్టో తయారుచేసి బాండ్ పేపర్ పై సంతకం పెట్టించే పాలసీ ప్రతి గ్రామంలో రావాలని అలాగే పోటీ చేసేటటువంటి ఏ ఒక్క అభ్యర్థిని కూడా వదిలి పెట్టవద్దు అని గెలిచినా,ఓడినా సరే చట్టపరిధిలో అయ్యే సమస్యలు పరిష్కరించాలని రాజకీయం అంటే సేవ చేయటానికి మాత్రమే వచ్చాడని విషయం ప్రతి ఒక్కరిలో చైతన్యం చేయాలని అవసరమైతే వారు సంతకం పెట్టలేని పక్షంలో వాళ్ల ఇంటికి వెళ్లి కలుస్తూ, ఇంటి ముందు నిరవధిక దీక్షలు కూడా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.అదేవిధంగా ఒక నమూనాని చట్టపరిధిలో ఉండే విధంగా బాండ్ పేపరు మీద సంతకం పెట్టించాలని అవసరమైతే వారి ఆస్తులను కూడా తనాఖా పెట్టే విధంగా పెద్ద ఎత్తున చైతన్యం చేస్తూ రాయించాలని వారు పిలుపునిచ్చారు.మా గ్రామంలో రావాలంటే మీ ఆస్తి విలువ, బాండ్ పేపర్ అలాగే మీరు చేసిన కార్యక్రమాలు పూర్తి వివరాలతో రావాలని బోర్డ్లు పెట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన జిల్లా నాయకులు కనితి వెంకటేష్ అశ్వరావుపేట మండల అధ్యక్షులు సోందెం సుమన్ నాయకులు రామకృష్ణ తాటి లక్ష్మయ్య , రైతు సేన మండల అధ్యక్షులు కొర్శ వెంకటేష్,కుంజ వెంకటేష్ యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 24
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News