దేశంలో తొలిసారిగా మెలోడీ వాయిస్ క్లినిక్..
సెంచురి హాస్పిటల్లో ఆఫీసు బేస్డ్ లారింగాలిజి విధానంలో ఇఎన్టి. డాక్టర్స్ ట్రైనింగ్ సదస్సు...
దేశంలో తొలిసారిగా మెలోడీ వాయిస్ క్లినిక్..
హైదరాబాద్ 29 అక్టోబర్ 2023. (వాయిస్ ఆఫ్ కామన్ మాన్ రంగా.శ్రీదేవి): బొంగురు గొంతుకి, స్వరనాడులలో ఏర్పడ్డ పొలిప్స్ ,కణుతులు లకు ఆపరేషన్ అవసరo లేకుండా పేషెంట్ మాట్లాడుతున్న సమయుమలోనే లేజర్ తో తీసివేసే ఆధునిక చికిస్తా విధానన్నే ఆఫీసు బేస్డ్ లారింగాలిజిగా వ్యవహరిస్తారు. ఈ విధానములో స్వర నాడులలో ఏర్పడ్డ కణుతులు పెద్దమత్తు మరియు ఆపరేషన్ అవసరం లేకుండా అవుట్పేషెంట్ లోనే చిన్న మత్తు ద్వారా తీసే వేసే అవకాశమున్నది .దీనివల్ల పేషెంట్ కు తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ లభించటం మాత్రమే కాకుండా ప్రాణానికి భద్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశమున్నది. మన దేశంలో ఈ విధానం ప్రస్తుతం వొక్క మెలోడీ వాయిస్ క్లినిక్ సెంచురి హాస్పిటల్లో మాత్రమే లభిస్తున్నది. ఈ విధానం దేశంలోని ప్రజలందరికీ అం దాలని దేశం లోని ఇ ఎన్ టి డాక్టర్స్ ట్రైనింగ్ ఇవ్వాలని ఈ సదస్సు జరగనున్నది. సుమారు ౩౦ మంది దేశ విదేశాలనుండి ఇ ఎన్ టి డాక్టర్స్ ఈ సదస్సు కి రిజిస్టర్ చేసు కున్నారు. ఈ సదస్సు కి ప్రముఖ వాయిస్ సర్జెన్ మరియి ఫౌండర్ ది అసోసియేషన్ అఫ్ ఫోనోర్జన్స్ అఫ్ ఇండియా డా . వి. ఫణీంద్రకుమార్ కోర్సు డైరెక్టర్ గా ఉంటారు. ఈ సదస్సు అక్టోబర్ 28,29 తేదీలలో జరుగుతుంది. మెలోడీ వాయిస్ క్లినిక్ డివిజన్ సెంచురి హాస్పిటల్ ,వాయిస్ ఫౌండేషన్ యు ఎస్ ఏ, ఏ ఓ ఐ టి, ఎస్ & హైదరాబాద్ , తాసల్ప సంయుక్తంగా నిర్వహిస్తారు. డా కె. సమతారాయి ప్రెసిడెంట్ అసోసియేషన్ అఫ్ ఫోనోసర్జన్స్ అఫ్ ఇండియా చీఫ్ గెస్ట్ గా ఉంటారు. డా.గంగాధర్ ,డా. హేమంత్ సెంచురీ హాస్పిటల్, డా ద్వారాకనాథ రెడ్డి , డా .శేఖర్ రెడ్డి , డా.రణబీర్ సింగ్ , డా. నాగేందర్ స్పెషల్ ఇన్వైటీస్ గా ఉంటారు. మనిషికి స్వరమన్నది ఓ వరం. మాటలు మాట్లాడాలన్నా, పాటలు పాడాలన్నా, వాదన వినిపించాలన్నా, లాలించాలన్నా, కోపగించుకోవాలన్నా, ప్రస్ఫుటంగా ఓ విషయం వెల్లడించాలన్నా, అవతలివారిని ఆకట్టుకోవాలన్నా.. అన్నింటికీ ఉపయోగపడేది స్వరమే. గాయకులు, డబ్బింగ్ కళాకారులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, టీవీ ప్రజెంటర్లు, న్యూస్ రీడర్లు.. ఇలా అందరికీ స్వరం చాలా ముఖ్యమైనది. వీళ్లంతా దాదాపు ప్రతిరోజూ స్వరాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే తగిన వైద్యులకు చూపించు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా.. జీవనశైలి మార్పుల ద్వారా చాలా వరకు స్వర సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యపానం స్వరానికి అత్యంత ప్రమాదకారులు. వాటిని పూర్తిగా మానేయడం ఉత్తమం. కెఫిన్ (కాఫీలో ఉంటుంది), ఆల్కహాల్.. ఈ రెండింటివల్ల గొంతు, స్వరపేటిక ఎండిపోతాయి (నిర్జలీకరణ). అందువల్ల వాటిని నివారించాలి. తప్పనిసరిగా తాగాల్సి వచ్చినా, తగినంత నీళ్లు తాగుతుండాలి. స్వరతంత్రులు బాగా హైడ్రేటెడ్‌గా ఉంటే స్వర సమస్యలు చాలావరకు రావు. వాయిస్ థెరపీ, ఫోనో సర్జరీ ఒకవేళ ఇలాంటి వృత్తి నిపుణుల్లో ఎవరికైనా గొంతు కొంచెం సమస్యగా ఉందని అనిపిస్తే వెంటనే వాయిస్ స్పెషలిస్టులకు చూపించుకోవాలి. సాధారణ ఈఎన్‌టీ వైద్య నిపుణులు వీటికి పరిష్కారం చూపించలేకపోవచ్చు. స్వరనాడులకు పక్షవాతం రావడం, థైరాయిడ్ శస్త్రచికిత్సలు చేయించుకోవడం వల్ల కొందరికి పూర్తిగా మాట పడిపోవచ్చు. అలాంటి వారికి కూడా శస్త్రచికిత్సలతో నయం చేసే అవకాశం ఉంది. కొందరు మగవారికి ఆడగొంతు ఉండటం, ఆడవారికి మగ గొంతు ఉండటం వల్ల సామాజికంగా సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటివారిలో ఫోనో సర్జరీ అనే ప్రక్రియ ద్వారా వారికి మాట తీరు మార్చుకోవచ్చు. ఇక గాయకులు, డబ్బింగ్ కళాకారుల్లాంటివారిలో కొందరికి స్వరనాడులలో పోలిప్స్ ఏర్పడతాయి. మరికొందరికి కేన్సర్ కారణంగా కణితులు ఏర్పడే ప్రమాదముంది. ఇలాంటివారికి శస్త్రచికిత్స అవసరం లేకుండా కూడా లేజర్ లారీనజేయల్ ప్రొసీజర్స్ చేయొచ్చు. ఇక సమస్య ప్రారంభదశలోనే ఉంటే అలాంటివారికి శస్త్రచికిత్సల వరకు వెళ్లక్కర్లేకుండా వాయిస్ థెరపీలతో నయం చేసే అవకాశం ఉంది.
Comment List