
వలిగొండలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి
నివాళులర్పించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వలిగొండలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఆమె చేసిన సేవలు అమోఘమని ఆమెఖ్యాతిని కొనియాడారు. ఆనాడు పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కూడా ఆమెదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, వాకిటి అనంతరెడ్డి,పాశం సత్తిరెడ్డి, పబ్బు ఉపేందర్ బోస్, కంకల కిష్టయ్య, బద్దం సంజీవరెడ్డి, గరిసె రవి, పలుసం సతీష్, బత్తిని సహదేవ్, బత్తిని నగేష్, మామిడి సత్తిరెడ్డి, కాసుల వెంకన్న,పాల కుర్ల వెంకటేశం, కొండూరు సాయి, పాలకుర్ల వెంకటేశం, పుల్లగుర్ల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List