ఎన్నికలవేళ గ్రూప్ అడ్మిన్... తస్మాత్ జాగ్రత్త

On
ఎన్నికలవేళ  గ్రూప్ అడ్మిన్... తస్మాత్ జాగ్రత్త

-రెచ్చగొట్టొద్దు... సంయమనం కోల్పోవద్దు - సోషల్ మీడియా కామెంట్ల పైన పోలీసుల నిఘా.. అప్రమత్తత అవసరం - గ్రూప్ అడ్మిన్లదే బాధ్యత.. గ్రూప్ అడ్మిన్లు బీ కేర్ ఫుల్.. - ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల హెచ్చరిక - చౌటుప్పల్ సిఐ. ఎస్ దేవేందర్

చౌటుప్పల్. నవంబర్3. న్యూస్ ఇండియా తెలుగు.

సోషల్ మీడియా... ఒకరి నుండి ఒకరికి సమాచారం చేరవేసేందుకు ఫేస్బుక్, వాట్సప్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా పనికి వచ్చే సామాజిక మద్యం, అయినా ప్రస్తుత కాలంలో అది చాలా దుర్వినియోగం అవుతుంది. ఫేస్బుక్, వాట్సప్ లలో ఇష్టారాజ్యంగా ఎవరికివారు తప్పుడు పోస్టులు పెడుతూ ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తూ వ్యవహరిస్తున్నారు. వదంతులను వ్యాపింప చేస్తున్నారు. సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక అలాంటి వారికి చెక్ పెట్టడానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు నడుం బిగించారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారా? ఎవరో పెట్టిన పోస్ట్ మీకు నచ్చలేదన్న కారణంతో కాస్త కఠినంగా కామెంట్లు చేస్తూ వ్యతిరేకించారా? అయితే పోలీసు కేసులో ఇరుక్కున్నట్లే.. ఇప్పటివరకు సామాజికమధ్యమంలో మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతూ వచ్చిన పోలీసులు ...ఇప్పుడు పోస్టుల కింద కామెంట్లు పెడుతున్న వారి పైన నిఘా ఉంచనున్నారు. ఐటీ చట్టంతోపాటు,ఐపీసీ కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాట్సప్ గ్రూపులు నిర్వహిస్తున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరమని సూచిస్తున్నారు.

*గ్రూప్ అడ్మిన్ బీ కేర్ పూ ల్...

ఏ గ్రూపులో అయినా సరే వదంతులు గాని, తప్పు పోస్ట్లు గాని పెడితే అడ్మిన్ లను బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎటువంటి సమయంలోనైనా గ్రూప్ అడ్మిన్ లు తగు జాగ్రత్తలు తీసుకొని తప్పుడు పోస్టులు ఎవరైనా గ్రూప్ లో పెట్టినట్లయితే వాటిని వెంటనే డిలీట్ చేయడంతో పాటు, అటువంటి వారిని గ్రూప్ నుంచి తొలగించుకోవడం వారికే మంచిదని సూచిస్తున్నారు.

Read More భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

* కామెంట్ల విషయంలో అప్రమత్తత అవసరం

Read More ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలకు సన్నద్ధమ అయ్యేవారు. పాస్ పోర్టులకు దరఖాస్తు చేసుకునేవారు. విద్యార్థులు, యువత ఇలా ఎవరైనా కామెంట్ల విషయంలో అప్రమత్తత అవసరమని పోలీసులు తెలుపుతున్నారు. కామెంట్లు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం వారికే మంచిదని సూచిస్తున్నారు.

* గ్రూప్ అడ్మిన్ బీ కేర్ ఫుల్...

ఫేస్ బుక్, వాట్సప్ లలో గ్రూప్ అడ్మిన్ లో గ్రూప్ సభ్యులు ఏది పడితే అది పోస్ట్ చేయకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. క్షణికావేశంలో మీ భవిష్యత్తులు నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఒక్కొక్కసారి గ్రూప్ సభ్యులు చేసిన పోస్టులకు కూడా గ్రూప్ అడ్మిన్ లే బాధ్యులవుతారని తెలుపుతున్నారు. ఒకవేళ అవి వదంతులు అయితే, తప్పుడు ప్రచారాలు అయితే, వేరే వ్యక్తిని కించపరిచే పోస్ట్ అయితే అటువంటి వాటి వల్ల వారికి ఏం జరిగినా చట్టారీత్యా గ్రూప్ అడ్మిన్ కే శిక్ష పడుతుంది అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

-గ్రూప్ అడ్మిన్ లదే బాధ్యత

 

 చౌటుప్పల్ సి ఐ. ఎస్ దేవేందర్ 

ప్రజలు సైతం సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి, ఏది వాస్తవము ఏది అవాస్తవమో తెలుసుకున్న తర్వాతనే స్పందించాలి. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సామాజిక మాధ్యమాలలో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ ప్రసంగాలను,ఇతరులను కించపరిచే, మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. వివిధ సామాజిక మాధ్యమాలలో నమోదవుతున్న పోస్టులను సైబర్ టీం ఎప్పటికప్పుడు అణువణువునా పర్యవేక్షిస్తూనే ఉంటుందని గుర్తించాలి. సామాజిక మాధ్యమాలపై నిరంతరం సైబర్ పెట్రోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు అందరూ సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఏ గ్రూపులో అయితే అభ్యంతకర పోస్టులు,మతపరమైన కామెంట్లు పెడతారో వారి పట్ల గ్రూప్ అడ్మిన్లు తగు జాగ్రత్తలు తీసుకొని వెంటనే వారిని,ఆ పోస్టును డిలీట్ చేయడం మంచిది. లేకపోతే గ్రూప్ అడ్మిన్ పైన చర్య తీసుకోబడుతుంది.

Views: 189

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.