వెంకన్న మృతికి శంకర్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి.
పాడె మోసిన శంకర్ నాయక్ కుమారుడు సూర్యచంద్ర.
వెంకన్న మృతికి బిఆర్ఎస్ కార్యకర్తల సంతాపం.
*నల్లమస వెంకన్నకు కన్నీటి నివాళులు.
*కన్నీటి పర్యంతమైన శంకర్ నాయక్.
*సొఖ సంద్రంలో పోనుగోడు గ్రామం.
*తరలివచ్చిన బిఆర్ఎస్ కార్యకర్తలు.
*నివాళులర్పించిన మంత్రి, ఎంపీ.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
పార్టీ అంటే వెంకన్న వెంకన్న అంటే పార్టీ అన్నట్టుగా నమ్ముకున్న పార్టీకి ఎన్నడూ వమ్ము చేయని కార్యకర్తగా ఎలాంటి కార్యకర్తనైన నేనున్నానంటూ అక్కున చేర్చుకుని సమస్యను పరిష్కరించి ఆ కార్యకర్తకు వెన్నంటే ఉండి నడిచిన నల్లమస వెంకన్న శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు గుండె నొప్పితో బాధపడుతూ మృతి చెందిన సంఘటన తెలియగానే మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ వెనువెంటనే వెంకన్న పార్థివ దేహాన్ని చూసి తట్టుకోలేక శోకమై విలపించారు. బిఆర్ఎస్ పార్టీలో పోనుగోడు గ్రామం నుండి పోనుగోడు అంటే నల్ల మాస వెంకన్న అన్న పేరు శుక్రవారం రోజుతో మాసిపోయింది. ప్రత్యేక గుర్తింపు ఉన్న శంకరన్న ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన రోజుల్లేవు. చెడ్డ పేరు తెచ్చుకున్న దాఖలాలు లేవు అలాంటి మంచితనం ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మరణించడం పార్టీకి గ్రామానికి తీరని లోటు.వెంకన్న పార్థీవదేశానికి గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంపీ మాలోత్ కవిత పూలమాలవేసి కన్నీటితో నివాళులర్పించారు. బానోత్ శంకర్ నాయక్ కుమారుడు సురేష్ చంద్ర వెంకన్న పార్థివదేహాన్ని పాడై కట్టడంతో ఆ పాడెను శంకర్ నాయక్ కుమారుడైన సూర్యచంద్ర మోశారు. పార్థివ దేహం ట్రాక్టర్ పై తీసుకు వెళ్లడానికి అంతిమయాత్రలో పాల్గొని శంకర్ నాయక్ తానే స్వయంగా ట్రాక్టర్ పై కూర్చొని ట్రాక్టర్ నడుపుకుంటూ అంత్యక్రియలు నిర్వహించారు.నల్లమాస వెంకన్న అంతిమయాత్రలో టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొని వెంకన్నకు ఘనమైన నివాళులర్పించి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని శోకసంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోనుగోడు గ్రామస్తులు కన్నీటి సొఖమై విలపించారు.
Comment List