చేయగలిగింది చెప్తా చెప్పిందే చేస్తా: గూడూరు నారాయణరెడ్డి

సొంత డబ్బులతో డిగ్రీ కాలేజీని నిర్మిస్తా

చేయగలిగింది చెప్తా చెప్పిందే చేస్తా: గూడూరు నారాయణరెడ్డి

IMG-20231105-WA1282
మాట్లాడుతున్న గూడూరు నారాయణరెడ్డి

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి కాదు పైసల శేఖర్ రెడ్డి అని బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీ లో ఆయన పాల్గొని రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీ బిడ్డనై వస్తున్న ఒక ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శాయ శక్తుల కృషి చేస్తానని, అసెంబ్లీలో కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడని టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఏ విధంగా ఓట్లు వేస్తారని, అదేవిధంగా రెండు నెలలు పార్టీని వీడి టిఆర్ఎస్ కి వెళ్లి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి కూడా క్యాడర్ లేదని ఆయన అన్నారు. తన వద్ద డబ్బు బలం లేకున్నా పుణ్యం సేవా ప్రజాబలం ఉన్నదని అందుకే ఈ ఒకసారి మీ బిడ్డకు కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. అమ్మల్లారా అక్కల్లారా వస్తున్న నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటారా ?అని సెంటిమెంట్తో అడిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సి.ఎన్.రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య,మండల అధ్యక్షులు నాగేల్లి సుధాకర్, మైసోల్ల మత్స్యగిరి, చందా మహేందర్ గుప్తా, రాచకొండ కృష్ణ, జిల్లా స్వర్ణ కార సంఘం అధ్యక్షుడు కొండపర్తి బాలాచారి, పడమటి జగన్మోహన్ రెడ్డి, కొత్త రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.

Views: 283
Tags:

Post Comment

Comment List

Latest News

తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య.. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య..
కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ని కూల్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.రాత్రికి రాత్రి కూల్చివేతలు ..కలెక్టర్, ఎమ్మార్వో ఇతర ప్రభుత్వ అధికారులు...
నూతన బస్సు సర్వీసు ప్రారంభం
తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ...
పులిగిల్ల నుండి ఉప్పల్ వరకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం
సింగరేణి లాభంలో 33% వాటా బోనస్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్
పహిల్వాన్ పూర్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు