కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన ఆకుల సతీష్, రజిని
కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు
మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల రజిని
జనగామ పట్టణానికి చెందిన తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు ఆకుల సతీష్ కుమార్,మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల రజిని మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. సతీష్
గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కోదండరాం సార్ తో కలిసి ఉద్యమం చేసి స్వరాష్ట్రం సిద్దించే వరకు పోరు చేసిన ఉద్యమకారులు. అలాగే జనగామ జిల్లా సాధన ఉద్యమంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జిల్లా సాధనలో వరంగల్ సెంట్రల్ జైలులో వారం రోజులు గడిపారు.
తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రాజీనామా చేశారు. వీరి సతిమణి మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల రజిని జిల్లా ఎర్పాటు కోసం జనగామ మున్సిపల్ కౌన్సిలర్ గా మొదటి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.వీరు ఇరువురు
మంగళవారం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బిఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
Comment List