కనుచూపు మేర వరకు మూడు రంగులు
జన సముద్రంలో మారిన పాలకుర్తి.....
పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తో రేవంత్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యశస్విని రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పోటెత్తిన పాలకుర్తి ప్రజానికం భారీగా తరిలివచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.పట్టణ కేంద్రంలో ఉన్న సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నుండి MRO కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా రాజకీయాలకు సంబంధం లేకుండా మా ప్రాంత ప్రజల కష్టాలను తీర్చడానికి మా అత్త - మామ ఝాన్సీ - రాజేందర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
పాలకుర్తి నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చేయాలనీ ఆలోచనతో మా అత్తగారు కాంగ్రెస్ పార్టీ నుండి పాలకుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకున్నారు. కానీ కొందరు మా అత్తగారు పోటీలో ఉంటే వారు గెలవలేము అన్న భయంతో, రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత టెక్నికల్ కారణాలు సృష్టించి మా అత్తగారిని పోటీలో లేకుండా చేశారు.
కానీ మా అత్తగారి ఝాన్సీ రెడ్డి ఆశయ సాధన కోసం, పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ద్యేయంగా,మీ అందరి ఆడబిడ్డగా, ఝాన్సీ రెడ్డి కోడలుగా, ప్రతినిత్యం మీతోనే ఉండాలని, మీ మధ్య ఉండాలని, మీ కుటుంబంలో ఒక భాగ్య స్వామినే , మీ కష్టాలను తీర్చడానికి పాలకుర్తి నియోజకవర్గని మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి, మీ అందరి ఆశీస్సులతో , ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ తో, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కెసిఆర్ కుటుంబంది.
తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా కెసిఆర్ కుటుంబం, పాలకుర్తి నియోజకవర్గం లో 15 సంవత్సరాలుగా దయాకర్ రావు ప్రజల సొమ్మును దోచుకున్నారు తప్పితే, ప్రజలకు చేసింది ఏమీ లేదు.
రేషన్ షాప్ డీలర్ గా ఉన్న దయాకర్ రావు, అధికార దుర్వినియోగానికి పాల్పడి వేల ఎకరాల భూమిని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన సొంత ఖాతాలో వేసుకున్నాడు తప్పితే పాలకుర్తి నియోజకవర్గనికి చేసింది ఏమీ లేదు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న దయాకర్ రావు, పేరుకి మంత్రి తప్ప నియోజకవర్గంలో ఒక డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కానీ, మహిళా సాధికారత కోసం ఎలాంటి కార్యక్రమాలు కానీ, నిరుద్యోగ యువత కోసం, చదువుకునే విద్యార్థుల కోసం, రైతన్నల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు.
ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా ఎన్నికల ముందు దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి అంటూ మోసపూరిత హామిలతో ఓట్లు వేయించుకునే పనులు దయాకర్ రావు చేస్తున్నాడు.
మోసపూరిత హామీలతో, ప్రజలను మోసం చేస్తూ, పబ్బం గడుపుతున్న దయాకర్ రావుని పాలకుర్తి నియోజకవర్గం నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
వీరనారి చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ, ఈ పాలకుర్తి గడ్డ.. ఆనాడు రజాకార్లను ఊరికించి తరిమి కొట్టిన ఘనత చాకలి ఐలమ్మ ది, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఇప్పటి నయా నిజం కెసిఆర్ ని, పాలకుర్తిలో దయాకర్ రావుని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి
కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో లాగా ఆరు గ్యారెంటీ కార్డులను వెంటనే అమల్లోకి తీసుకొస్తాను
కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే, కచ్చితంగా చేసి తీరుతుంది. అందుకు నిదర్శనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం..
ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి 9 సంవత్సరాలు, పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్ రావుకు 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి.తొమ్మిది సంవత్సరాలలో చేయని అభివృద్ధి 5 సంవత్సరాలలో చేసి చూపిస్తా.
ఈ 20 రోజులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయండి, రాబోయే ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తా.
నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు వచ్చే జీతాన్ని కూడా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే ఉపయోగిస్తా.
రాబోయే ఎన్నికల్లో ఈ దగా కోర్ దయాకర్ రావుని తరిమి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకై బూత్ స్థాయి నుండి ఒక సైనికుని లాగా పనిచేయాలి.
Comment List