సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు నామినేషన్ దాఖలు చేశారు

నకిరేకల్ గడ్డ పోరాటాల పురిటి గడ్డ, బొజ్జ చిన్న వెంకులు

On
సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు నామినేషన్ దాఖలు చేశారు

న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 10 (నల్లగొండ జిల్లా ప్రతినిధి): నకిరేకల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు నామినేషన్ దాఖలు చేశారు. నకరేకల్ మినీ స్టేడియం నుండి ఆర్ ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిరేకల్ గడ్డ సిపిఎం పార్టీ కీ 50 సంవత్సరాల చరిత్ర ఉంది అన్నారు.శాసనసభలో నర్రా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉంటే రేడియోలో వినేవారు సుమారుగా 15 సంవత్సరాల నుండి చట్టసభలు మూగబోయినాయి. ప్రశ్నించే గొంతుక లేదు చట్టసభల్లో పేద ప్రజలపై కొట్లాడానికి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని నర్రా రాఘవరెడ్డి వారసుడుగా తెలియజేస్తున్నాను, బీరు బిర్యాని ఆశపడకుండా పేద ప్రజల పక్షాన కొట్లాడే వారికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజానీకానికి చెప్తున్నాను అని అన్నారు.

Views: 59

About The Author

Post Comment

Comment List

Latest News