న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు
తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 41 కి చేరింది. దీంతో కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీవో జారీ చేసింది. వేడుకలు జరిగే ప్రదేశాల్లో ప్రధాన ద్వారం దగ్గర.. థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం […]
తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 41 కి చేరింది. దీంతో కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీవో జారీ చేసింది.
వేడుకలు జరిగే ప్రదేశాల్లో ప్రధాన ద్వారం దగ్గర.. థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇతర కార్యక్రమాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ హైదరాబాద్‌లో పార్కులు, మాల్స్ వద్ద నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదు..
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List