National Council Meeting : ఫుల్ జోష్‌లో బీజేపీ

On

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం ఫుల్ జోష్‌తో వెళ్తోంది. 2024 ఎన్నికల ఎజెండాగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ ఒక్క ఛాన్స్ వదలటం లేదు. అందుకు హైదరాబాద్‌ వేదికగా జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనుంది. సమావేశాల నిర్వహణపై కీలక నేతల భేటీ జరిగింది. ఇందుకు ఐదుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు దూకుడుగా ముందుకెళ్తోంది. […]

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం ఫుల్ జోష్‌తో వెళ్తోంది. 2024 ఎన్నికల ఎజెండాగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ ఒక్క ఛాన్స్ వదలటం లేదు. అందుకు హైదరాబాద్‌ వేదికగా జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనుంది. సమావేశాల నిర్వహణపై కీలక నేతల భేటీ జరిగింది. ఇందుకు ఐదుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు

ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు దూకుడుగా ముందుకెళ్తోంది. ఈ దిశగా ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ఎజెండానూ రూపొందిస్తోంది. టార్గెట్ తెలంగాణపై ఫోకస్ పెట్టిన అగ్రనాయకత్వం.. జులైలో హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహణను అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ తో సహా అగ్రనేతలు …రెండు రోజుల పాటు ఇక్కడే బసచేయనున్నారు.

బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్‌, జాతీయ సంస్థాగత ఇంచార్జ్ శివ ప్రకాష్‌తోపాటు జాతీయ కార్యవర్గ సమావేశల ఇంచార్జ్ అరవింద్ మీనన్ సమావేశానికి హాజరయ్యారు. అటు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్‌తోపాటు ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ భేటీలో పాల్గొన్నారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కోసం ఐదుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో బండి సంజయ్, లక్ష్మణ్, రామచందర్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రామచందర్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. అలాగే సమావేశాల నిర్వహణ కోసం మరో 34 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల సభ్యులతో ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు నాయకులు భేటీ అయ్యారు…

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News