Governor Praja Darbar : గవర్నర్ ప్రజా దర్బార్
Governor Praja Darbar : తెలంగాణ గవర్నర్ తమిళిసై తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు…ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇందులోభాగంగానే ఈనెల 10న రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ జరగనుంది. గవర్నర్‌ను వచ్చి కలవాలనుకునే మహిళలు ఫోన్ లేదా ఈ మెయిల్ ద్వారా అపాయింట్‌మెంట్ ఖరారు చేసుకోవచ్చన్నారు. మరోవైపు ఉగాది వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు గవర్నర్ తమిళిసై […]
Governor Praja Darbar : తెలంగాణ గవర్నర్ తమిళిసై తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు…ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇందులోభాగంగానే ఈనెల 10న రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ జరగనుంది. గవర్నర్‌ను వచ్చి కలవాలనుకునే మహిళలు ఫోన్ లేదా ఈ మెయిల్ ద్వారా అపాయింట్‌మెంట్ ఖరారు చేసుకోవచ్చన్నారు.
మరోవైపు ఉగాది వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు గవర్నర్ తమిళిసై ఇదివరకే ప్రకటించారు. ఇక నుంచి నేరుగా ప్రజలను కలుస్తానన్నారు. రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
అటు ఉగాది వేడుకలకు అధికార పక్షం హాజరుకాకపోవడంతో గవర్నర్ తమిళి సై తనదైన శైలిలో స్పందించారు. ఇతర రాష్ట్రాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నా…సీఎం కేసీఆర్ రాలేదన్నారు. అటు అధికారిక గణతంత్ర దినోత్సవ వేడుకలకు సైతం సీఎం దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. రాజ్‌భవన్ తలుపులు ప్రజలకు ఎప్పుడూ తెరిచే ఉంటాయని గవర్నర్…ప్రజల సమస్యలను అర్థం చేసుకునేందుకే ఫిర్యాదుల పెట్టెలను ప్రారంభించినట్లు తెలిపారు. తాను ఎవరికీ లొంగేదిలేనన్న గవర్నర్.. గవర్నర్ హోదాలో తన పరిమితులు తెలుసనన్నారు.
అటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో… తన ప్రసంగం లేకపోవటంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అటు యాదాద్రి ఉద్ఘాటన ఉత్సవానికి సైతం ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాలేదన్నారు. ఇతర గవర్నర్లకు భిన్నంగా గవర్నర్ తమిళిసై ప్రజా సమస్యలపై చొరవ చూపుతుండటం, వినతులు స్వీకరిస్తుండటం…అధికార పక్షానికి మింగుడు పడటం లేదని రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List