నో యాక్సిడెంట్స్ డే నిర్వహించిన ఎస్సై నరసింహా రావు
బి పేట న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండల ఎస్సై బి.నరసింహా రావు అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గల పందిళ్లపల్లి టోల్ ప్లాజా వద్ద శనివారం నో యాక్సిడెంట్ డే కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమం లో భాగంగా ఎస్సై నరసింహా రావు ద్విచక్ర వాహనాల పై హెల్మెంట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్న వారికి, అలానే లైసెన్స్, వాహన సంభందిత పత్రాలు లేని వారిని పరిశీలించి అపార రుసుము విధించారు.ఈ సందర్భంగా ఎస్సై నరసింహా రావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల పై ప్రయాణం చేసేవారు తగిన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు.నిబంధనలను పాటించని యెడల చట్ట ప్రకారం తగిన చర్యలతో పాటు రోడ్డు ప్రమాదానికి గురైన యెడల మీ కుటుంబం పరిస్థితులు కూడా మారిపోతుందని హెచ్చరించారు.అలానే ప్రయాణ సమయం లో హెల్మెంట్ తప్పకుండా ఉపయోగించాలని అన్నారు.అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని చట్ట ప్రకారం ఉన్న నిబంధనలను తప్పక పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List