హైదరాబాద్‌లో రెచ్చిపోయిన మందుబాబులు
హైదరాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. తాగి ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. మందుబాబుల నిర్లక్ష్యానికి ఓబాలిక ప్రాణాలను కోల్పోయింది. ఈఘటన మొయినాబాద్‌లో చోటు చేసుకుంది. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్.. కూతుళ్లు ప్రేమిక, సౌమ్య అక్షయలతో కలిసి కనకమామిడి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో చేవేళ్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న సంపత్ రెడ్డి.. కారుతో స్కూటీని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో ప్రేమిక అక్కడిక్కడే మృతిచెందింది. వెంకటేష్, సౌమ్య అక్షయల తీవ్ర గాయాలవడంతో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి […]
హైదరాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. తాగి ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. మందుబాబుల నిర్లక్ష్యానికి ఓబాలిక ప్రాణాలను కోల్పోయింది. ఈఘటన మొయినాబాద్‌లో చోటు చేసుకుంది. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్.. కూతుళ్లు ప్రేమిక, సౌమ్య అక్షయలతో కలిసి కనకమామిడి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో చేవేళ్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న సంపత్ రెడ్డి.. కారుతో స్కూటీని ఢీకొట్టాడు.
ఈప్రమాదంలో ప్రేమిక అక్కడిక్కడే మృతిచెందింది. వెంకటేష్, సౌమ్య అక్షయల తీవ్ర గాయాలవడంతో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సంపత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం కారణమని అధికారులు తెలిపారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List