ఇందిరమ్మ రాజ్యం లేకపోతే ప్రజలంతా అడుక్కుతినట్లే
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం
ఇందిరమ్మ రాజ్యం లేకపోతే తెలంగాణ ప్రజలంతా అడుక్కుతినట్లే అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కెసిఆర్ ఫ్యామిలీ అడుక్కుతినేదని అన్నారు. కెసిఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సే అని అన్నారు. కాంగ్రెస్ బలపరిచితేనే సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ అయ్యారని అన్నారు. ఆనాడు కేసీఆర్ ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది ఇందిరమ్మ కుమారుడు సంజయ్ గాంధి అని గుర్తు చేశారు. మారుమూల తండాలో లంబాడీలకు నిలువునీడనిచ్చింది ఇందిరమ్మ రాజ్యమే అన్నారు. పోడు భూములకు పట్టాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలోని జరిగేవని అన్నారు. తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతుందని ఇక కెసిఆర్ పాలనకు కాలం చెల్లిందని కెసిఆర్ ను ఇంటికి పంపించే సమయం వచ్చిందని అన్నారు. చివరిగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Comment List