బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన యూత్ కార్యకర్తలు
యూత్ ప్రెసిడెంట్ దేవల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో
యాదాద్రి భువనగిరి జిల్లా మోటా కొండూర్ మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామం నుంచి బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దేవల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో యూత్ కార్యకర్తలు అంతా టిఆర్ఎస్ ను వీడి బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కరోనాకాలం నుంచి బీర్ల ఐలయ్య చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ముత్తిరెడ్డిగూడెం గ్రామ టిఆర్ఎస్ యూత్ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దేవల్ల వెంకటేష్ మాట్లాడుతూ అభివృద్ధి చేసే నాయకుడికి ఓటు వేయాలని, బీఆర్ఎస్ లో తగిన గుర్తింపు లేనందున తాను బీ ఆర్ ఎస్ వీడుతున్నట్టు తెలియజేశారు. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం చేయి గుర్తుకు ఓటు వేసి బీర్ల ఐలయ్యను గెలిపించాలని వారన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పంతుల రాంబాబు, పంతుల వెంకటేశ్వర్లు, దేవరాజు గౌతమ్, ఆడెపు సోములు, అన్న బోయిన కనకయ్య, గడ్డం జహంగీర్, దేవరాజు పోచయ్య దేవరాజు సతీష్ ,మేస్త్రి యాదయ్య, తదితరులు చేరారు.
Comment List