బంపర్ మెజారిటీతో మా కాట శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించుకుంటాం

పటాన్చెరు ప్రజలు

By Ramesh
On
బంపర్ మెజారిటీతో  మా కాట శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించుకుంటాం

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ MLA అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామంటున్న పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు. వివరాల్లోకి వెళితే గడిచిన 9 ఏళ్లలో గులాబీ పార్టీ ప్రజలను ఎంతగానో మోసం చేసిందని తెలంగాణ కోసం బలిదానమైన అమరవీరుల కుటుంబాలను సైతం పట్టించుకోలేదని ఇప్పుడేమో ఎన్నికల కోసం తెలంగాణ నినాదం ఎత్తుకుందని ప్రజలు మండిపడుతున్నారు. గులాబీ పార్టీ ముఖ్యంగా జాబ్ నోటిఫికేషన్ విషయంలో మరియు ధరణి పోర్టల్ తో ప్రజలను ఎంతగానో మోసం చేసిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోరుగడ్డపై రైతులు సైతం ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలంగాణలో చాలా ఉన్నాయి అని అన్నారు. అధికార దాహంతో పేదల భూములు కబ్జా చేశారని అనేక ఆరోపణలు ఉన్నాయి అని అన్నారు. ఉద్యోగాలు లేక విద్యార్థులు సైతం అతి చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు శోకం మిగిలించారు అని ఇదంతా గులాబీ పార్టీ నేతల అరాచక పాలన వల్లే అని ప్రజలు బావోద్వేగానికి గురయ్యారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రైతు రారాజులా ఉండేవాడని ఇప్పుడేమో రైతు ఒక బానిస అయ్యాడని ప్రజలు అన్నారు . కాంగ్రెస్ వస్తేనే తమ బ్రతుకులు మారుతాయని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని రైతు సుభిక్షంగా ఉంటాడని అందుకే కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ప్రజల ధీమా వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గ  కాంగ్రెస్ MLA అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఎవరికైనా ఆపద వస్తే అన్నలా ముందుకొస్తాడని ఇలాంటి నాయకుడు పటాన్చెరు నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గత ఎన్నికల్లో గులాబీ మాయమటలకు ప్రలోభపడి కాట శ్రీనివాస్ గౌడ్ గెలిపించుకోలేకపోయామని కానీ ఇప్పుడు లక్ష మెజారిటీతో కాట శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించుకునే తీరుతామని పటాన్చెరు ప్రజలు అన్నారు.

Views: 114
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News