పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం...

బిఆర్ఎస్ జనగామ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించడమే లక్ష్యం... గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న గులాబీ దళాలు... ప్రభుత్వం చేపట్టిన పథకాలను గడపగడపకూ వివరిస్తూ ప్రచారం.. ప్రపంచ దేశాలకే తెలంగాణ ఆదర్శం...

By Ramesh
On
పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం...

ప్రపంచ దేశాలకే తెలంగాణ ఆదర్శం...

నవంబర్ 27 ,న్యూస్ ఇండియా తెలుగు (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

IMG-20231127-WA1103

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు నమునా బ్యాలెట్ తో విసృత ప్రచారం నిర్వహించారు.గడిచిన తొమ్మిదేళ్ళ ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వెల్లడించారు. కేసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు అమలు చేసారని గుర్తు చేశారు.ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మీ, కెసిఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, కంటి వెలుగు వంటి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రపంచ దేశాలకే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. బిఆర్ఎస్ సర్కార్ పింఛన్లను పెంచిందని, సౌభాగ్య లక్ష్మీ కింద మహిళలకు మూడు వేలు ఇవ్వనున్నట్లు, గ్యాస్ ధరను 400 కు ఇవ్వనున్నట్లు ,రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు ,కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ కేసీఆర్ సర్కార్ను తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

IMG-20231127-WA1033

Read More ఎంపీటీసీ అరే లావణ్య రవీందర్ ను బిజెపిలోకి రావాలని ఆహ్వానించిన -

Views: 371
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్...
జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను  కాపాడలంటూ అధికారుల‌కు ఆదేశం..
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!