అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....

జారే తన ప్రచారాన్ని విజయవంతంగా ముగించారు

On
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా// అశ్వారావుపేట // శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేట మండలంలో గుర్రాల చెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ తన ప్రచారాన్ని విజయవంతంగా ముగించారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా// అశ్వారావుపేట // శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేట మండలంలో గుర్రాల చెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ తన ప్రచారాన్ని విజయవంతంగా ముగించారు, 6 గ్యారంటీ పథకాలను విస్తృతంగా వివరిస్తూ పర్యటించి  తన అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని కోరారు, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ కోసం ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతోనే తను రాజకీయాలకు వచ్చానని తనను ఆశీర్వదించాలని ప్రజా తీర్పుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని  ధీమా వ్యక్తం చేశారు, బిఅర్ ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు తీరుస్తామని ప్రజలకు అండగా ఉంటామని తెలియపరిచారు, ప్రచారంలో చివరి ఊరు మీదేనని  ఎన్నికల కోడ్ కు లోబడి అనుకున్న సమయానికి పూర్తి చేశానని తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా జారే ఆదినారాయణ జూపల్లి రమేష్,మొగల్ల చేన్నకేశరావు,అల్లాడి రామారావు,మిత్ర పక్ష నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు మరియు జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ మందపాటి నాగ లక్ష్మి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానూలు తదితరులు పాల్గొన్నారు.

Views: 22
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News