ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు

త్వరపడి రిజిస్టేషన్ చేసుకోండి.. వయసుకు ఆతీతంగా ఆడి చూపిద్దాం

By Teja
On
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ 'ఆడుదాం ఆంధ్ర'. ఈ క్రీడా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే! అంతేకాకుండా క్రీడల్లో విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతులు ప్రకటించింది. ఇంతటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఇతర వివరాలు మీకు తెలుసా! అయితే ఒక లూక్ వేద్దాం.

ఆడుదాం ఆంధ్రలో మీరు పాల్గొంటున్నారా? అయితే ఇప్పడే వెళ్లి వెబ్ సైట్ (aadudamandhra.ap.gov.in)లో డిసెంబరు 13లోపు రిజస్టర్ చేసుకోండని ఒలింపిక్ పతకాల విజేత, ఐదు ప్రపంచకప్ లు కైవసం చేసుకున్న పీవీ సింధు పిలుపునిచ్చారు. ఆట, పిల్లలకు మాత్రమే కాదని పిల్లలకైనా, పెద్దలకైనా ఈ ఆట మనందరిది అని ఆడుదాం ఆంధ్రలో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చాని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల్లో, మరిముఖ్యంగా యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే దిశగా మరియు వారి ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి వేదికను అందించటమే ముఖ్య ఉద్దేశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  రాష్ట్రంలో అతిపెద్ద క్రీడా ఉత్సవాన్ని ప్రారంభించేందుకు 'ఆడుదాం ఆంధ్రా' తో సీఎం ముందుకు వచ్చారు. రాష్ట్ర యువత శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడానికి, అథ్లెటిక్ ప్రతిభను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సంకల్పంతో ముందడుగు వేసిందని ఏపీ అధికారులు తెలిపారు. 

క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్‌) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్‌ మీట్‌’ను చేపడుతున్నారు. యువతలో క్రీడా­స్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభా­గాలైన క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్‌ పోటీలను ఏర్పాటు చేస్తోంది.

క్రీడా పోటీలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వహిస్తారు?

Read More జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

ప్రతి గ్రామ సచివాలయాల నుండి ఐదు దశల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.  సచివాలయాలు, మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు జరుగుతాయి. అక్కడ ఉత్తమ ప్రతిభ కనిపరచిన వారికి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఆవకాశం లభిస్తుంది. మ్యాచ్‌కు అర్హత సాధించిన విజేతల ను నాకౌట్ ప్రాతిపదికన తదుపరి స్థాయికి ముందుకు పంపిస్తారు. 

Read More బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్

అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనిపరచిన క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఆవకాశం లభిస్తుందని, మరిముఖ్యంగా క్రీడల్లో రారాజైన క్రికెట్ ఆటలో ఉత్తమ క్రీడాకారులకు ఐపీఎల్ లో MI & CSK టీంలలో ఆడే ఆవకాశం వస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా విజేతలకు నగదు బహమానం కూడా లభించనుంది.

Read More విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను  కాపాడలంటూ అధికారుల‌కు ఆదేశం..

నగదు బహుమానం ఎంత?

ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కోసం నగదు బహుమానం రూ. 12 కోట్ల వరకు కేటాయించింది. విజేతలు ఈవెంట్ జరిగిన ప్రతిసారి  నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల నుంచి ప్రైజ్ మనీ అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో క్రికెట్, ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్‌లలో విజేతల్లో 1వ స్థానానికి రూ. 5 లక్షలు, 2వ స్థానానికి రూ. 3 లక్షలు, 3వ స్థానానికి రూ. 2 లక్షలు అందిస్తారు. బ్యాడ్మింటన్‌లో రూ. 2 లక్షలు, రూ. లక్ష, లేదా రూ 50,000 ఇస్తారు. అంతేకాకుండా, ఆసక్తిని కనబరిచిన అనేక క్రీడాకారులకోసం అకాడమీలు పెట్టి వృత్తిపరమైన శిక్షణలు ఇస్తామని అంటున్నారు. అంతేకాకుండా పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తారు.

క్రీడా కిట్లు కూడా ఇస్తున్నారు

సాధారణంగా పేద,మధ్య తరగతి వారు ఆడే ప్రతిభ ఉన్న స్తోమత లేక లేదా సరైన సదుపాయాలు లేక  ఆటలకు దూరమైపోతుంటారు. అటువంటి సమస్యను గుర్తించి క్రీడాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉచిత బేసిక్ స్పోర్ట్స్ కిట్లను స్పాన్సర్ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. తద్వారా మా ప్రభుత్వానికి అందరు ఒక్కటే అనే నినాదం మరోసారి ఋజువుతుంది. ప్రభుత్వం తరుపున మనం అందించే కిట్లలో  3 బేసిక్ క్రికెట్ కిట్లు, 6 బ్యాడ్మింటన్ రాకెట్లు, 3 నైలాన్ బారెల్స్, షటిల్, 1 బ్యాడ్మింటన్ & వాలీబాల్ నెట్, మరియు 2 టెన్నికాయిట్ రింగ్స్ ఉన్నాయి

ప్రతిభ ఉండి ఆడలేని వారికి ఇదొక చక్కని ఆవకాశమని ఆంధ్రప్రదేశ్ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Views: 14

About The Author

Post Comment

Comment List

Latest News

బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్...
జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను  కాపాడలంటూ అధికారుల‌కు ఆదేశం..
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!