ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు

హోంగార్డ్స్ ఆఫీసర్స్ సేవలు అమోఘమైనవి

On

ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి

 భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 6: కొత్తగూడెంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపీఎస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై,పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘం అని అన్నారు.జిల్లాలో భారీ వరదల సమయంలో,వీవిఐపి పర్యటనలు మరియు ఎన్నికల విధులతో పాటు సాధారణ డ్యూటీలను నిర్వర్తించడంలో హోంగార్డ్స్ ఆఫీసర్స్ పాత్ర చాలా కీలకమని అన్నారు.ఖాకీ యూనిఫామ్ వేసుకుని ప్రజలకు సేవలందిచడం ఒక గొప్ప వరమని అన్నారు.పోలీస్ శాఖలో బాధ్యతగా విధులు నిర్వర్తించే వారికి ఎల్లప్పుడూ విశేష గుర్తింపు లభిస్తుందని తెలిపారు.ఘనంగా ఏర్పాటు చేసిన ఈ హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అనంతరం విధులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కొంతమంది హోంగార్డ్ ఆఫీసర్స్ కు బహుమతులను అందజేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లాలో పనిచేసే సుమారుగా 300 మంది హోంగార్డ్స్ ఆఫీసర్స్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ బాబు, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,పాల్వంచ డిఎస్పీ వెంకటేష్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి,మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కిష్ణయ్య,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,సిఐలు కరుణాకర్,రమేష్, మురళి మరియు ఆర్ఐలు హోంగార్డ్స్ ఇంచార్జి ఆర్ఐ నరసింహారావు,అడ్మిన్ ఆర్ఐ రవి,ఎంటిఓ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఆర్ఐ ట్రైనింగ్స్ నాగేశ్వరరావు మరియు ఇతర అధికారులు,సిబ్బందితో పాటు హోంగార్డ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Views: 17
Tags: Breakiing

About The Author

Post Comment

Comment List

Latest News

బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్...
జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను  కాపాడలంటూ అధికారుల‌కు ఆదేశం..
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!