జగనన్న ను మరొకసారి ముఖ్యమంత్రి చేద్దాం:ఎంపీపీ దొంతా

By Khasim
On
జగనన్న ను మరొకసారి ముఖ్యమంత్రి చేద్దాం:ఎంపీపీ దొంతా

‘ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే..’ కార్యక్రమాన్ని యర్రగొండపాలెం మండలం వేంకటాద్రి పాలెం సచివాలయంలో నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీపీ దొంతా కిరణ్ పాల్గొని జగనన్న ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకూ అందించిన డీబీటీ, నాన్ డీబీటీ పథకాల లబ్ధిని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డును  ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే..’ బుక్ లెట్ ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగనన్న మనకి మళ్ళీ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు.  ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ప్రజల్ని ఇంతలా ఓన్ చేసుకున్నది లేదన్నారు. ప్రజలందరి అవసరాలు కూడా తెలుసుకుని వివిధ సంక్షేమ పథకాల రూపంలో వారికి అందిస్తున్నారన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా తీరుస్తున్నారన్నారు. అందుకే ఇలాంటి పాలన ప్రజలు మళ్లీ పొందాలంటే కచ్చితంగా ఈ రాష్ట్రానికి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్పష్టం చేశారు. అందుకే ఈ విషయాన్ని ‘ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందకు కావాలంటే..’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వాలంటీర్స్, గృహ సారథలు, నాయకులు, కార్యకర్తలు అందరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మళ్లీ మరోసారి ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వాదించాలని  ఆకాంక్షించారు.ఈ కార్యక్రమములో ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, జడ్పిటిసి విజయభాస్కర్,ఒంగోలు మూర్తి రెడ్డి, మండల కన్వీనర్ కొప్పర్తి ఓబుల్ గురెడ్డి,సచివాలయాల కన్వీనర్ సయ్యద్ జబివుల్లా, నర్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి,ఒంగోలు మూర్తి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.IMG-20231208-WA0621(1)

Views: 35
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News