ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి

On
ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి

ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి

*ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి*

న్యూస్ ఇండియా తెలుగు: డిసెంబర్12

*ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి*

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్  ఎస్.కె అబ్బాస్ మాట్లాడుతూ ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులకు సీట్లు దక్కలేదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయించారని అన్నారు . పార్టీ కోసమే పనిచేసి ఎన్నో ఎదురు దెబ్బలు తట్టుకుని , కేసులు పాలై , అవమానలు భరించి ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ కు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ తరపున ఎంపీ టికెట్ కేటాయించాలని లేదా ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కోరారు . కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిల గెలుపులో కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు . తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అధిష్టాన మాటలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు . రాబోయే పార్లమెంటు (ఎంపీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వాళ్లకు కాకుండా పాత వాళ్లకు అవకాశాలు కల్పించాలని కోరారు . కాంగ్రెస్ సీనియర్ నాయకులు చోటా బాబా లాంటి వ్యక్తులకు కూడ నామినేటెడ్ పదవులు కేటాయించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.డి మొహమ్మద్ , ఎన్.ఎస్.యు.ఐ టౌన్ ప్రెసిడెంట్ పి యశ్వంత్ వర్ధన్ , మైనార్టీ నగర నాయకులు ఎండి మహబూబ్ , రెండోవ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ ఎస్ డి ఫరీద్ లు పాల్గొన్నారు.

Read More ఘనంగా పుట్టినరోజు వేడుకలు

Views: 17
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్