అమ్మా లాంటి తెలుగు భాషాను రక్షించుకుందాం

On

అమ్మా లాంటి తెలుగు భాషాను రక్షించుకుందాం ఆచార్య బన్న ఐలయ్య న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30(దగ్గుల వినోద్ రిపోర్టర్):- సోమవారం ఆర్ట్స్ కళాశాలలో తెలుగు విభాగం శాఖాధిపతి డాక్టర్ చిర్ర రాజు గౌడ్ అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవ జరిగింది సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అలయ్య వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి గారికి పూలమాలతో నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ […]

అమ్మా లాంటి తెలుగు భాషాను రక్షించుకుందాం
ఆచార్య బన్న ఐలయ్య
న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30(దగ్గుల వినోద్ రిపోర్టర్):- సోమవారం ఆర్ట్స్ కళాశాలలో తెలుగు విభాగం శాఖాధిపతి డాక్టర్ చిర్ర రాజు గౌడ్ అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవ జరిగింది సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అలయ్య వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి గారికి పూలమాలతో నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గిడుగు రామ్మూర్తి జీవిత మొత్తం తెలుగు భాషకు అంకితం చేసినటువంటి మహా వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు అని వారి ఆశయ సాధనలో ప్రస్తుతం తరుణంలో అమ్మ లాంటి, అమృతం లాంటి, భాష, నా తెలుగు భాష, తేనెలోలుకు నా తెలుగు భాష లాంటి భాషను ఇటాలియన్ వర్తకులు తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” పిలుస్తుంటే మనమేమో పరాయి భాషల వెంట పోతున్నాం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెలుగు భాష అనేది కనుమరుగైపోయే అవకాశం ఉన్నది కాబట్టి మనం అందరం స్కూల్ లలో ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు విద్యను తప్పనిసరిగా నిర్బంధంగా ప్రవేశపెట్టే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసి తెలుగు భాషా ను రక్షించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హనుమంత్ , తెలుగు విభాగం శాఖాధిపతి డాక్టర్ చిర్ర రాజు గౌడ్, డాక్టర్ మామిడి లింగయ్య,డాక్టర్ కర్రె సదాశివ, కళాశాల ఏ.ఆర్ కృష్ణయ్య కళాశాల చెందిన అధ్యాపకులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News