తెప్పోత్సవం మరియు వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

On
తెప్పోత్సవం మరియు వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

తెప్పోత్సవం మరియు వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్IMG-20231222-WA0073

ముక్కోటి ఉత్సవాలకు భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి

జిల్లా పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్  )డిసెంబర్ 21 : నేడు  జరగబోయే తెప్పోత్సవం మరియు 23వ తేదీన జరగబోయే వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి  వెల్లడించారు.ముక్కోటి ఉత్సవాలకు భద్రాచలం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పార్కింగ్ స్థలాలు,లడ్డూ కౌంటర్స్,సెక్టార్ ప్లాన్స్ ను సూచించే విధంగా https://mukkoti.netlify.app/ లింకుతో పాటు QR కోడ్ ను కూడా విడుదల చేయడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా సెక్టార్ల వారిగా బందోబస్తు విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పాలు సూచనలు చేశారు.భక్తుల రద్దీ దృష్ట్యా భద్రాచలం పట్టణంలో రామాలయ పరిసర రహదారులలో ట్రాఫిక్ ఆంక్షలను విధించడం జరుగుతుందని తెలిపారు .వివిధ శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. 
Views: 65
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు 27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) జనవరి 19: కొత్తగూడెం  కార్పొరేట్ పరిధిలోని 27 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల సుధారాణి తన దరఖాస్తును  భద్రాద్రి కొత్తగూడెం...
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత 
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..