చేపల వేటకు వెళ్లి మత్స్యకారుని మృతి

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుని మృతి

Screenshot_20231226_202026~2

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గోకారం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వలిగొండ మండలంలోని గోకారం గ్రామానికి చెందిన పబ్బు శ్రీరాములు (65) చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. రోజు మాదిరిగానే 24వ తేది ఆదివారం రోజున గ్రామంలోని మల్ల సముద్రం కుంటలో చేపలు పట్టుటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చేపలు పట్టే వల అతనికి చుట్టుకుని కుంటలో పడిపోయాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో 25వ తేదీ న అతని కోసం అంతటా గాలించిన ఫలితం లేకపోవడంతో 26వ తేదీన మల్ల సముద్రం కుంటలో శవమై తేలాడు. మృతునికి ఈత వచ్చిన కూడా వల చుట్టుకోవడంతో అతను మరణించాడు. మృతుని అల్లుని ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకుని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Views: 327
Tags:

Post Comment

Comment List

Latest News