భువనగిరి ఎమ్మెల్యే కుంభంని కలిసిన అక్కంపల్లి కాంగ్రెస్ నాయకులు
నవ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కుంభం
యాదాద్రి భువనగిరి జిల్లా
వలిగొండ మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నవ తెలంగాణ వలిగొండ క్యాలెండర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దేశిరెడ్డి వీరారెడ్డి, ఉపాధ్యక్షుడు బుంగమట్ల మచ్చ గిరి, యూత్ అధ్యక్షులు నిమ్మల కృష్ణ, దేశి రెడ్డి కమలాకర్ రెడ్డి కేశబోయిన శంకరయ్య, కేశ బోయిన నరసింహ, దేశిరెడ్డి వెంకట్ రెడ్డి, కందుల బాలేశ్వర్, బుంగపట్ల రాము, కేశబోయిన వెంకటయ్య, బుంగమట్ల సురేష్, నిమ్మల వెంకటయ్య, శ్యామల సారయ్య, నారి శ్రీనివాస్, నిమ్మల ఆంజనేయులు, కనక బోయిన దర్శన్, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comment List