వకీల్ సాబ్ సంగం సత్తయ్య సంతాప సభ..

సత్తయ్య గ్రామానికి, యూత్ కు చేసిన సేవలు వెలకట్టలేనివి..

On
వకీల్ సాబ్ సంగం సత్తయ్య సంతాప సభ..

*వకీల్ సాబ్ సంగం సత్తయ్య సంతాప సభ* 

 *సత్తయ్య గ్రామానికి, యూత్ కు చేసిన సేవలు వెలకట్టలేనివి* 

IMG-20240102-WA0040
సంతాప సభకు ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరు..

 *సంతాప సభకు ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరు* 

 *జ్ఞాపకార్థంగా విగ్రహాన్ని ఏర్పాటుకుఅందరూ సహకరించాలి* 

Read More దసరా పండగకి ఊరెళ్తున్నారా..!?

 *ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయాలని* 

Read More పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలి

ఇబ్రహీంపట్నం,(న్యూస్ ఇండియా తెలుగు): యాచారం మండలం నందివనపర్తి  గ్రామానికి చెందిన సీనియర్ అడ్వకేట్, జ్యోతి యూత్ సంఘం ఫౌండర్ సంగం సత్తయ్య  ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన గుర్తుగా ఆదివారం జ్యోతి ఎడ్యుకేటెడ్ యూత్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు.ముందుగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, జ్యోతి యూత్ ఫౌండర్ ,సీనియర్ అడ్వకేట్ సంగం సత్తయ్య కు కుటుంబసభ్యులు, మిత్రులు, యూత్ సభ్యులు , సహచర అడ్వకేట్లు శ్రేయోభిలాషులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సంతాన సభలో ఆయన మాట్లాడుతూ.. కీర్తిశేషులు సంఘం సత్తయ్య అడ్వకేట్,జ్యోతి యువజన సంఘం తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గత 50 సంవత్సరాల్లో సంఘం ఏర్పడినప్పటి నుంచి అనేక సంఘ సేవ కార్యక్రమాలను సమాజంలో యువకులను మంచి నడవడిక నేర్పడ్డారులో గ్రామ అభివృద్ధికి తోడ్పాటులో పాటు గ్రామానికి కావలసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు అధికారులతో కోట్లాది సాధించేందుకు ఎంతో కృషి చేశారని సంఘం సత్తయ్య  కొనియాడం జరిగింది.గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవ కార్యక్రమాలు అందరూ యువకులు గ్రామంలోని ప్రజలు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పెద్ద ఉన్నత పదవులు చదివిన రాజకీయాలకు తన సొంత పనుల కోసము సొంత లాభం కోసము చూడకుండా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడడం చాలా గొప్ప విషయమని అన్నారు.ఎందరో మహానుభావులు పుడతారు చచ్చిపోతారు కానీ కత్తేలాంటి నిస్వార్ధపరుడు సమాజంలో నందివనపర్తి గ్రామంలో పుట్టడం ఒక ఆదర్శవంతుడని చెప్పవచ్చు.గతంలో పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు నాతో రాజకీయంగా నేను సూచనలు అతనితో పాలుపంచుకునేది చాలా గ్రామాలు ఉన్నాయి కానీ దయ, ఆర్మీ లీడరు ఆ సైన్యము నడిపించారు.చాలా గొప్ప విషయము ప్రతి భవిష్యత్తులో గాని యువకులు సత్తయ్యనీ ఆదర్శంగా తీసుకోవాలని ఎటువంటి అలవాట్లకు యువకులు బలికాకుండా ఆయన సూచనలు ఇవ్వడం వల్ల ఈ గ్రామము ఈ పరిస్థితి సుఖశాంతులతో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటున్నాయి .అంటే నాకు నచ్చిన విషయము ఆయన ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడి పనులు సాధించే విషయాన్ని నాకు నచ్చిన విషయము రాజకీయాల్లో సత్తయ్య చేరి ఉంటే ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో పూర్తిగా మార్పు వచ్చి ఉండేది ఆయన చేసిన సేవా కార్యక్రమాలు యువకులకు ఎంతో ఆదర్శమని చెప్పవచ్చు. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ  ఆయన గొప్పతనం గురించి,నిస్వార్థ సేవ గురించి గ్రామ అభివృద్ధి గురించి చెప్తుంటే నాకు పది సంవత్సరాల క్రితమే పరిచయం అయి ఉంటే ఆయనను నా తోడుగా తీసుకొని వెళ్లే అవకాశం వుండే కానీ ఆయనను నేను రాజకీయాలకు ఆహ్వానించగా ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగింది. నేటి సమాజంలోఇంత నిస్వార్ధపడుతున్నటువంటి సత్తయ్య లాంటి వ్యక్తి లేకపోవడం ఈ గ్రామానికి గాని ఈ ప్రాంతానికి గాని తీరని లోటు అని డాక్టర్ బూర నర్సయ్య తెలిపారు.వారి కుటుంబానికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సంఘానికి నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని భవిష్యత్తులో సత్తయ్య  యొక్క గ్రహాన్ని జ్యోతి ఎడ్యుకేటెడ్ ఆవరణలో ఏర్పాటు చేసేందుకు నా యొక్క వంతు కృషి చేస్తానని దానికి నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అందుకు జ్యోతి యువజన సంఘం తీసుకున్నటువంటి న్యాయానికి నా పూర్తి సహకారము , తను ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ రవీందర్, మాజీ ఎమ్మెల్యే కొండిగంటి రాములు,యూత్ అధ్యక్షులు హనుమంతు బాబు, మాజి ఎంపిపి రాచర్ల వెంకటేశ్వర్లు,మాజీ సర్పంచ్ శేష గిరి రావు,రాయికంటి విజయ్ కుమార్,సీనియర్ న్యాయవాది యాదయ్య గౌడ్, బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి,ముడేడ్ల వెంకట్ రెడ్డి, యూత్ సీనియర్ సభ్యులు బ్రహ్మచారి , లక్ష్మీ కాంత్ రెడ్డి,యాదయ్య గౌడ్ ,పాండరీ గౌడ్, ప్రవీణ్, మాజీ యూత్ అధ్యక్షులు మొర్రి రమేష్,సంగం గణేష్,యూత్ సభ్యులు ,గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Read More అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని జెబి ఇన్ ఫ్రా గ్రూప్ సూచన...

Views: 219

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన* కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
జై శ్రీమన్నారాయణ,వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీకొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల...
కన్నడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో   *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!
నూతన ఎస్సై ని సన్మానించిన ఇమామ్ సాబ్ లు‌‌..
ఘనంగా HRCCI తెలంగాణ రాష్ట్ర సదస్సు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...
పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!