స్థానికులకే ఉద్యోగ అవకాశాలు __చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
స్థానికులకే ఉద్యోగ అవకాశాలు
__చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
న్యూస్ ఇండియా తెలుగు జనవరి 02(మందమర్రి చిలుక సంజీవ్): మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో గల 19వ వార్డులో నిర్వహిస్తున్నా ప్రజాపాలన కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై అభయ హస్తం ఆర్ గ్యారంటీ ల ధరఖాస్తు స్వీకారంలో భాగంగా సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆలస్యం చేయకుండా ఆరు గ్యారంటీలను వేగంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాట్లు తెలిపారు.ఆ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు అనే రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాట్లు తెలిపారు.అలాగే 5లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని దాన్ని కూడా అమలు చేస్తామని తెలిపారు.అలాగే కొత్త రేషన్ కార్డులను ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఎవరైనా దరఖాస్తులు చెయ్యని వారు ఉంటే వెంటనే వాళ్ల ఇంటికి అధికారులు వెళ్లాలని ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదేలు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ పార్టీనాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List