నాన్ లోకల్ అభ్యర్ధితో పాయకరావుపేటలో వైసీపీ పనైపోయిందా?
పాయకరావుపేటలో కంబాల జోగులుకు చుక్కెదురు? తలోదారిలో నాలుగు మండలాల నాయకులు స్థానిక నాయకురాలికి ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం నాన్ లోకల్ కు ఇవ్వడంపై అప్పుడే టీడీపీలో జోష్ జగనన్న మా విన్నపం వినాలంటున్న స్థానికులు పాయకరావుపేటలో పార్టీని బతికించాలంటూ విన్నపం
పాయకరావుపేటలో వైసీపీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. స్థానికేతరుడిని వైసీపీ అభ్యర్ధిగా నియమించడంతో పాయకరావుపేట వైసీపీలో ముసలం పుట్టింది. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేస్తున్న తమల్ని కాదని..నాన్ లోకల్ వ్యక్తిని ఎలా అభ్యర్ధిగా ప్రకటిస్తారంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో కంబాల జోగులకు పాయకరావుపేటలో సహకారం లేకుండా . పోయింది. అటు ఇన్నాళ్లు తమల్ని ఏకతాటిపైకితీసుకువచ్చి పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్న పెదపాటి అమ్మాజీని కాదని.. వేరే జిల్లా నుంచి అభ్యర్ధిని తీసుకువచ్చి ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు మండలాల నాయకులు తమ నిరసనను హైకమాండ్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనేది త్వరలోనే తేలనుంది
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List