పాయకరావుపేటలో కంబాల జోగులును మార్చాల్సిందేనంటూ నాయకుల తీర్మానం
లేకుంటే సహకరించలేమంటూ వార్నింగ్
పునరాలోచనలో వైసీపీ హై కమాండ్?
వైసీపీలో భగ్గుమన్న అసంతృప్తి
పాయకరావుపేట వైసీపీలో నిప్పు రాజుకుంది. నియోజకవర్గ సమన్వయకర్తగా కంబాల జోగులును ప్రకటించడంతో స్థానిక నాయకత్వం భగ్గుమంది. లోకల్ వారికి కాకుండా బయటి జిల్లా వ్యక్తులకు ఎలా బాధ్యతలు ఇస్తారంటూ ఎక్కడిక్కడ గ్రామాల్లో వైసీపీ కేడర్ ప్రశ్నిస్తోంది. నాన్ లోకల్ వ్యక్తికి బాధ్యతలు అప్పగించి.. పార్టీని గెలిపించమంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో కనీసం పార్టీ హైకమాండ్ కు ఒక్కరంటే ఒక్కరు కూడా కార్యకర్త దొరకలేదా అని నిలదీస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఇంఛార్జి మంత్రికి తమ ఆవేదన చెప్పుకున్న నాయకులు.. ఇప్పుడు అవసరం అయితే.. జగన్ దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
బయటి వ్యక్తులకు బాధ్యతలు ఇచ్చి పార్టీని భూ స్థాపితం చేస్తారా?
నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల్ని, ముఖ్య నాయకుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోకుండా హైకమాండ్ ఎలా నిర్ణయం తీసుకుంటుందని నియోజకవర్గంలో వైసీపీ కేడర్ అడుగుతోంది. ఇప్పటికైనా తమ నిర్ణయం వెనక్కి తీసుకోని స్థానిక నాయకురాలు, ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకి కేటాయించాలని లేకుండా మూకుమ్మడి రాజీనామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
వైసీపీ బలహీన అభ్యర్ధి అంటూ టీడీపీ నాయకుల్లో జోష్..
వైసీపీలో నేతల అసంతృప్తి జ్వాలల్ని తెలుగు దేశం పార్టీ క్యాష్ చేసుకుంటోంది. కంబాల జోగులు అభ్యర్ధి అయితే తమ విజయం నల్లేరు మీద నడకలాంటిదేనంటూ ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు
.........
స్థానిక వ్యతిరేకత నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్ధి మార్పు వైసీపీలో గందరగోళం పరిస్థితిని తీసుకువచ్చింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ కేడర్ అంతా అయోమయంలో ఉంది. స్థానికుడు కానీ వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించడంతో.. అసలు కంబాల జోగులు ఎవరో తమకు తెలియదని.. స్థానికులకు ఇస్తే ఈజీగా గెలిచే సీటును.. అనవసరంగా నాన్ లోకల్ వ్యక్తికి ఇచ్చి.. వైసీపీని బలహీనం చేశారనే గందరగోళంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అసలే వర్గ పోరుతో ఇబ్బంది పడుతున్న పార్టీ.. ఇప్పుడు నాన్ లోకల్ అభ్యర్ధి తో మరింత బలహీనమైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా లోకల్ మహిళా అభ్యర్ధిని ప్రకటిస్తే.. పార్టీకి బలం చేకూరుతుందని.. లేకపోతే పార్టీకి పాయకరావుపేట నియోజకవర్గంలో భవిష్యత్గు లేకుండా పోతుందనే టాక్ వినపడుతోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List