కేంద్ర బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలను ప్రతిఘటిద్దాం

కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం

On
కేంద్ర బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలను ప్రతిఘటిద్దాం

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్

 

నారాయణఖేడ్, జనవరి29 న్యూస్ ఇండియా 

కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు జాయింట్ గా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని ఈ సమ్మెను ప్రజలందరూ జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ అన్నారు.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం ప్రజా సంఘాల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అతిమేల మానిక్ హాజరై ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్పోరేట్ మతతత్వ విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ పెద్దలకు లక్షల కోట్ల మాఫీ చేస్తూ కార్మికుల కర్షకులపై అనేక బారాల మోపుతూ రైతాంగానికి, కార్మిక వర్గానికి నష్టం చేసే చట్టాలను తీసుకువచ్చి బడా కార్పొరేట్ పెద్దలకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్నారని,ఇంకోపక్క ఉపాధి, విద్య, వైద్యం, ఉద్యోగ భద్రత పై దాడి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజల యొక్క నడ్డి విరుస్తుందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పై దాడి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తు రిజర్వేషన్ తొలగిస్తుందని అన్నారు దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు తీవ్రంగా నష్టపోతారని సామాజిక న్యాయం దెబ్బతింటుందని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలపై పెద్ద ఎత్తున దాడులు జరిగిన మోడీ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో లేదని అన్నారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించాలని, మోడీ హటావో - దేశ్ బచావో అన్నారు ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక రైతు కూలీలు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అంబేద్కర్ సంఘం తాలూకా అధ్యక్షులు కాన్సిరాం, కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు సంగమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్, కెవిపిఎస్ కల్హేర్ మండల అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షులు అశోక్, నిజాంపేట్ మండల బాధ్యులు నితిన్, కంగ్టి మండల బాధ్యులు పవన్, నాగల్ గిద్ద మండల బాధ్యులు సంతోష్, మనూర్ మండల బాధ్యులు అరుణ్, రాజ్యరత్నం నారాయణఖేడ్ మండల బాధ్యులు రాజశేఖర్, నాయకులు రాములు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20240128-WA0062

Views: 114

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన* కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
జై శ్రీమన్నారాయణ,వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీకొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల...
కన్నడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో   *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!
నూతన ఎస్సై ని సన్మానించిన ఇమామ్ సాబ్ లు‌‌..
ఘనంగా HRCCI తెలంగాణ రాష్ట్ర సదస్సు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...
పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!