అంబేద్కర్ పూలే మహనీయుల బాటలో యువత నడవాలి

కలెక్టర్ వల్లూరి క్రాంతి

On
అంబేద్కర్ పూలే మహనీయుల బాటలో యువత నడవాలి

కెవిపిఎస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ

IMG-20240203-WA0004 కెవిపిఎస్ మహనీయుల క్యాలెండర్ (2024) ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు జిల్లా ఎస్పీ రూపేష్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి అఖిలేష్ రెడ్డి లతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఫూలే మహనీయుల బాటలో యువత నడవాలి అని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు అన్నారు. మహనీయుల చిత్రపటాలు లక్ష్యాలు ఆశలతో కుడిన క్యాలెండర్ తీసుకువచ్చిన కెవిపిఎస్ ను అభినందించారు.కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్ మాట్లాడుతూ అంబేద్కర్ మహాత్మజ్యోతిభాపూలే సావిత్రిబాయి పూలే మహనీయుల ఆశయ సాధన కృషి చేస్తుందని,ఆత్మగౌరవం సమానత్వం కులనిర్మూలన కోసం నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తుందని అన్నారుఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం అడివయ్య జిల్లా అధ్యక్షులు పి అశోక్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్ ఇమ్మయ్య రాజు నాయక్ రాజు కెవిపిఎస్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 105
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి