*క్రీడల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలి- కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల*
న్యూస్ ఇండియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడల్లో నంబర్ వన్ గా ఉండాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు యువతకు పెద్దపీట వేశారని కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు ఆడుదాం ఆంధ్ర విజేతలకు కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన ఆయన రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తూ యువతను ప్రోత్సహించేలా భావితరాలకు మంచి భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని క్రీడల్లో నంబర్ వన్ గా నిలిపేందుకు అహర్నిశలు తపించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అని అన్నారు యువత క్రీడల్లో రాణించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు నలదీశాల వ్యాపించేలా యువత తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు కనిగిరి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయిలో జరిగిన కోకో పోటీలో ప్రథమ బహుమతి సాధించిన మహిళా జట్టును ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి కనిగిరి జడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం వైసీపీ నాయకులు మూలే గోపాల్ రెడ్డి మాజీ ఎంపిటిసి వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comment List