భారత సైనికులు ఓ నిండు గర్భిణిని ప్రాణాపాయం నుంచి రక్షించారు
కాశ్మీర్, న్యూస్ ఇండియా ప్రతినిధి
On
ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని రక్షిత ప్రాంతానికి తరలించారు.. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గర్భిణికి నొప్పులు రావడంతో ఆమెను భారీ మంచు కురుస్తున్న కారణంగా వైద్య శాలకు తరలించడం కష్టతరమైంది. ఈ సమయంలో హుటాహుటిన స్పందించిన ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవలందించారు. 2 నుండి 3 అడుగుల లోతున ఉన్న మంచులో నడుస్తూ.. 7 నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న విల్గం ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆమెను తరలించారు. అనంతరం వైద్యులు ఆమెను పరీక్షించి ప్రసవం చేశారు.
Views: 32
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List