వ్యాపార సంస్థల సైన్ బోర్డులతో రోడ్డు ప్రమాదాలు
వ్యాపార సంస్థలు సైన్ బోర్డులతో రోడ్డు ప్రమాదాలు..
అధికారులు సైన్ బోర్డులను తొలగించాలి..
జిహెచ్ఎంసి అధికారులు మామూలకు అలవాటయి అలసత్వం..
ఎల్బీనగర్, ఫిబ్రవరి 06 (న్యూస్ ఇండియా ప్రతినిధి): అడ్డగోలుగా ఫుట్ పాత్ రోడ్లను ఆక్రమించిన హొటల్స్, షాపుల యజమానులు వారికి ఇష్టానుసారంగా ఇతర వ్యాపార సంస్థలు సైన్ బోర్డులను రోడ్లపై పెడుతూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ వారి ప్రాణాలు తీస్తుంటే జిహెచ్ఎంసి అధికారులు మామూలకు అలవాటయి అలసత్వం ప్రవర్తిస్తున్నారు. పట్టణ పరిధిలోని అనేక ప్రాంతాలలో ఫుట్ పాత్ లు మొత్తం చిరు వ్యాపారులు ఆక్రమించారు. నగర ప్రజలు వేలకోట్ల రూపాయలలో పన్ను రూపాన చెల్లిస్తుంటే ఆ డబ్బును ప్రజల సొమ్మును ఫుట్ పాత్ర నిర్మాణం పేరుతో రోడ్ల నిర్మాణం పేరుతో ఖర్చు చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు ప్రజలకు ఉపయోగకరంగా మార్చడంలో పూర్తిగా విఫలమైందనీ, ఇతర రాష్ట్రాలు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ల నుంచి ముఖ్యంగా ఉత్తర భారతీయులు పూర్తిగా రోడ్లను, ఫుట్ పాతులను ఆక్రమించేశారు. యేదేచ్చగా కిరాయిలకిస్తూ, ఇందులో ట్రాఫిక్ పోలీసులకు కూడా పాత్ర ఉందనేది జగమెరిగిన సత్యం. ఈ రోడ్డు మాఫియా పై కొంతమంది మున్సిపల్ సిబ్బంది ఇందులో పాత్రధారులు, సూత్రధారులు. ఇంత జరుగుతున్న జిహెచ్ఎంసి అధికారులు బాధ్యతగల అధికారులు నిద్రమత్తులో తూగుతూ నటిస్తున్నారా లేక అర్ధం కాని పరిస్థితి. ఈ ఫుట్ పాతుల ఆక్రమణ అరికట్టాల్సిన అధికారులు సిబ్బంది ఏం చేస్తున్నట్టు స్థానిక ప్రజలు, నాయకులు వివిధ సంఘాల ప్రజా సంఘాలు నాయకులు అవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే పట్టణ పరిధిలోని ఫుట్ పాత్ లలో చిరు వ్యాపారులను కట్టడి చేసి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు.
Comment List