బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన కథలపూర్ మండల అధ్యక్షుడు- గడిలా గంగప్రసాద్

- పార్టీ సభ్యత్వానికి రాజీనామా..

On
బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన కథలపూర్ మండల అధ్యక్షుడు- గడిలా గంగప్రసాద్

వేములవాడ, ఫిబ్రవరి09, న్యూస్ ఇండియా ప్రతినిధి

జగిత్యాల జిల్లా కథలపూర్ మండల బీఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షుడు, తండ్రియాల మాజీ సర్పంచ్ గడిలా గంగాప్రసాద్  బీఆర్ ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చారు.

FB_IMG_1707492455434

 కథలపూర్ మండల బీఆర్ యస్ అధ్యక్షుడు, తండ్రియాల మాజీ సర్పంచ్ గడిలా గంగాప్రసాద్ మండల అధ్యక్ష పదవికి, బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు.

Read More ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..

IMG_20240209_211935
రాజీనామా పత్రాన్ని జగిత్యాల జిల్లా  బీఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ కు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట అగన్న కు పంపారు.  రాజీనామా పత్రంలో గడిచిన ఎనిమిది సంవత్సరాలలో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, మండల యూత్ అధ్యక్షుడిగా మరియు మండల అధ్యక్షుడిగా పార్టీకి తన వంతు కృషి చేయడం జరిగిందని రాజీనామా పత్రంలో తెలిపారు. మండల అధ్యక్ష పదవిలో ఎన్నో ఒత్తిడి లకు గురైనప్పటికి పార్టీని ముందుకు నడిపించనని, కానీ పార్టీ ఓటమీ తర్వాత జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బీఆర్ యస్ పార్టీకి, మండల అధ్యక్షు పదవికి  రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే తెలుపుతాన్నారు.

Read More సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..

Views: 763
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News