వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి

వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి

Screenshot_20240213_193454~2

వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొగలిపాక గ్రామానికి చెందిన పబ్బు ఐలయ్య(48) వృత్తిరీత్యా గీత కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 6వ తేదీన రాత్రి వంట గది లో టీ పెడుతుండగా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తుకొని శరీరానికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా 12 వ తేదీన రాత్రి మరణించాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు

Views: 174

Post Comment

Comment List

Latest News