మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చాటిన కందుకూరి సోని...

By Ramesh
On
మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చాటిన కందుకూరి సోని...

IMG-20240219-WA1436

ప్రస్తుతం సివిల్ ఎస్ఐ గా ట్రైనింగ్ లో.... 

కానిస్టేబుల్ గా, గ్రూపు ఫోర్త్ ఫలితాలలో జూనియర్ అసిస్టెంట్ గా..... 

న్యూస్ ఇండియా తెలుగు, ఫిబ్రవరి 19 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

Read More వలిగొండలో ఘనంగా జ్యోతిరావు పూలే 197వ జయంతి

ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి..!. అలాంటిది.. ఉమ్మడి వరంగల్‌ ,  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన  కందుకూరి సోనీ గౌడ్..
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా  మూడు  ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ప్రశంశలు అందుకుంటుంది. గ్రామానికి చెందిన కందుకూరి బుచ్చమ్మ- శంకరయ్య దంపతుల చిన్న కుమార్తె సోనీ గౌడ్,నిరుపేద కుటుంబంలో పుట్టి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు తన సొంత గ్రామమైన కొన్నే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. పై చదువుల కోసం జిల్లా కేంద్రమైన జనగామలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ, పూర్తి చేశారు. అనంతరం పై చదువుల కోసం వరంగల్ జిల్లా కేంద్రంలోని హనుమకొండ లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జీనియస్ ( సీఈఓ రాము)ఎస్ ఐ,  కోచింగ్ సెంటర్లో, 2022, 2023 సంవత్సరంలో కోచింగ్  తీసుకున్నారు.  ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివి పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. అనంతరం సివిల్ ఎస్సై సాధించారు.ఆ రెండింటిలో ఎస్సై పోస్టు ఎంచుకున్నారు...
ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 ఫలితాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం  సివిల్  పోలీసు  సబ్ ఇన్స్పెక్టర్
హైదరాబాదులోని రాజేంద్రనగర్ శిక్షణలో ఉన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారక్క ,  జాతరలో విధులు నిర్వహిస్తున్నారు .  మూడు,  ఉద్యోగాలు సాధించిన  కందుకూరి సోనీ గౌడ్ ను ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, గ్రామస్థులతో పాటు, జిల్లా, మండల, గ్రామ, గీత కార్మిక నాయకులు, పలువురు గ్రామస్తులు అభినందించారు.

Read More నకిరేకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివిన మూడున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు 

Views: 2335
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు* *దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు*
*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు* *కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే నాయకులారా మడిపల్లి గ్రామంలో బహిరంగ చర్చకు రండి* *వేల్పుల...
కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు..
•అధికార అహంతో కాంగ్రెస్ నేతల దాడులు సిగ్గుచేటు.. •చర్యలు తీసుకొని యెడల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపడతాం...
టియుడబ్ల్యూజే(ఐజేయు జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
నకిరేకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివిన మూడున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు 
*కాంగ్రెస్‌ బిఅర్ఎస్ నాయకులకు మధ్య గొడవ* •బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి.
*కాంగ్రెస్‌ బిఅర్ఎస్ నాయకులకు మధ్య గొడవ* •బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి..