అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
సిసియస్, పటాన్ చెర్వు పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో సుమారు 27 లక్షల విలువ గల, 106 కిలోల నిషేదిత ఎండు గంజాయి సీజ్. సిసియస్, పటాన్ చెర్వు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : నమ్మదగిన సమాచారం మేరకు తేది: 08.05.2025 నాడు ఉదయం అందాజ 11:00 గంటల సమయంలో సిసియస్ టీం, పటాన్చెర్వు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ -3 టోల్ గెట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సంగారెడ్డి వైపు అనుమానాస్పదంగా వస్తున్న రెండు కార్లు (1) మారుతి స్విఫ్ట్ కార్ నెంబర్ టీఎస్ 15 ఎఫ్ హెచ్ 3441, (2) మారుతి బెల్లెనో కార్ నెంబర్ టీఎస్ 09 జి ఏ 6422 గల వాటిని ఆపి తనిఖీ చేయగా అట్టి రెండు కార్ల డిక్కిలలో గోదుమ రంగు కవర్ చుట్టిన 54 ( 54 * 2=106 కిలోల) ఎండుగంజాయి ప్యాకెట్స్ కనిపించినవి అని తెలియచేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... నిందితులు తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణహించుకొని, అస్సాం, ఒరిస్సా బార్డర్ నుండి ఎండుగంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ.. కర్ణాటక, మహారాష్ట్రా లలో అమ్మే ప్రయత్నం చేశారని తెలియజేశారు. అమ్మడానికి వెళుతుండగా మార్గమద్యలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సిసియస్ టీం, పటాన్చెర్వు పోలీసులు పై నాలుగు నిందితులను అదుపులోనికి తీసుకొని, ఎండుగంజాయి 54 ప్యాకెట్స్, నేరానికి వినియోగించిన 2-కార్లు, సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగిందని, నిందితున్ని రిమాండుకు తరలించారని తెలియచేసారు. జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసు శాఖ ఉక్కు పాదం మోపడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను సాగు, సరఫరా చేసిన సంగారెడ్డి జిల్లా ఎస్ -నాబ్ నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇట్టి గంజాయి అక్రమ రావాణ ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ అభినందించారు.
Comment List