మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశం. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

On
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.

WhatsApp Image 2025-05-09 at 3.55.19 PM (1)సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్నివెంటదివెంట నిర్దేశిత మిల్లులకు తరలించడంతో పాటు, తక్షణమే మిల్లుల వద్ద అన్ లోడింగ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు.కొండాపూర్ మండలం, గొల్లపల్లి గ్రామంలో  పీఏసీఎస్  ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గోడౌన్, జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతులను పలుకరించి, ధాన్యం అమ్మకం విషయంలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. కేంద్రాలకు ఎప్పుడు ధాన్యం తీసుకువచ్చారు, ఎన్ని రోజులకు తూకం జరిగింది, కేంద్రాల నిర్వాహకులు సహకరిస్తున్నారా, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాల రికార్డులను పరిశీలించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలతో కూడిన వాహనాలు ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకుని నిలువ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉన్న గోడౌన్లను గుర్తించాలని, హమాలీలు, లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా సరిపడా సంఖ్యలో టార్పాలిన్లు సమకూర్చుకోవాలని అన్నారు. జిల్లాలో  రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నందున కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ కూడా జాప్యం జరుగకుండా చూడాలన్నారు. రైతులు ఇబ్బందులకు గురికాకూడదని, నిర్ణీత గడువు లోపు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని హితవు పలికారు. ధాన్యం దిగుమతులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున వెంటదివెంట ధాన్యం సేకరణ జరుపుతూ, మిల్లుల వద్ద అన్ లోడింగ్ లో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, పి ఎ సి ఎస్ డై రెక్టర్ లు, రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.