సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.

On
సంగారెడ్డి  పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న జలీలోద్దీన్‌ సిద్దిఖి  అహ్మమద్‌ హుస్సెన్‌ మరోమారు గంజాయిని తరలిస్తూ ఎస్ టి ఎఫ్ ఏ టీమ్‌ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడిన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర జౌరంగబాద్‌లోని ఒక కంపెనీలో అపరేటర్‌గా పని పనిచేస్తూ  చేస్తాడు. వస్తున్న జీతం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారంలోకి దిగాడని సమాచారం. రెండేళ్లుగా ఉద్యోగం తో పాటు గంజాయి వ్యాపారం చేస్తు, 2023లో ఒకమారు గంజాయి రవాణ చేస్తూ అబుల్లాపూరమెట్‌లో పట్టుబడి కేసులో జైలుకు కూడ వెళ్లి వచ్చాడని తెలిపారు. జలీలోద్దీన్‌ సిద్దిఖి అహ్మమద్‌ హుస్సెన్‌ అనే వ్యక్తి సీలేరు నుంచి  గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో అమ్మకాలు  సాగిస్తూ ఉంటాడు. లక్ష్మీబాయి అనే మహిళ వద్ద 20.6 కేజీల గంజాయిని తీసుకొని జాతీయ రహదారి 65లో సంగారెడ్డి  పోతురెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో కారులో వెళ్తుండగా  గంజాయిని ఎస్ టి ఎఫ్  ఏ టీమ్‌ లీడర్‌ అంజి రెడ్డి టీమ్‌ సిబ్బంది పట్టుకున్నారు. ఈ కేసుల్లో గంజాయిని కొనుగోలు చేసి అమ్మకాల కోసం తీసుక  వెలుతున్న జలీలోద్దీన్‌ సిద్దిఖి అహ్మమద్‌ హుస్సెన్‌, గంజాయి  అమ్మకాలు జరిపిన లక్ష్మీబాయి, కృష్ణ కొన అనేవ్యక్తులపై కేసు నమోదు చేశారు. కారు, గంజాయి, నిందితుడు జలీలోద్దీన్‌ సిద్దిఖి అహ్మమద్‌ హుస్సెన్‌ అరెస్టు చేసి సంగారెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్ టి ఎఫ్ ఏ టీమ్‌ లీడర్‌ అంజి రెడ్డితెలిపారు.WhatsApp Image 2025-05-09 at 1.53.40 PM

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.