శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*

శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*

 

*శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*IMG-20240223-WA0000

విషయం : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా, మీడియా సంస్థల పరంగా ఉన్న సమస్యలు మరియు  సంఘ విద్రోహ శక్తులు, గత ప్రభుత్వ ద్వారా అక్రమంగా కేసుల పాలైన  జర్నలిస్ట్ సోదరుల సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ (TPJU)విజ్ఞప్తి...

మాన్యశ్రీ

Read More రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మీడియా రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ లను, నాన్ జర్నలిస్ట్ లను అందరిని కలుపుకొని తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ నూతనంగా ఏర్పాటు చేసాము. తెలంగాణ రాష్ట్రంలో 
ఎన్నెన్నో దారులుగా, వర్గాలుగా చీలిన అన్ని జర్నలిస్ట్ సంఘాలకు భిన్నంగా రాష్ట్రంలోని జర్నలిస్ట్ లందరం ఏకమై ఒక బావ సారూప్యతగల సర్వ స్వతంత్ర  జర్నలిస్ట్ సమూహంగా ఏర్పడ్డాం.

Read More ఘనంగా పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ కుటుంబాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే తమ ప్రభుత్వ సహాయ, సహకారం ఇప్పుడు ఎంతో అవసరం. మీడియా సంస్థల సహాయ, సహకారాలు అవసరం. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ లు ఆత్మ స్థైర్యం పెరగాలంటే గత ప్రభుత్వ ఆనవాళ్లు చెరిగిపోయి జర్నలిస్ట్ లు తిరిగి మీ ప్రభుత్వంలో ఆత్మ గౌరవం పెంపొందే దిశగా మేము ఎదగాలి. ఇందు కోసం ముఖ్యమంత్రిగా మీ సహాయం కోరుతున్నాం.

Read More పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..

తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ జర్నలిస్ట్ లు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లు, డెస్క్ జర్నలిస్ట్ లు, వెబ్ జర్నలిస్ట్ లు, వీడియో జర్నలిస్ట్ లు, ఫోటో జర్నలిస్ట్ లు, పొలిటికల్ కార్టునిస్ట్, చిన్న, మధ్య తరహా పత్రికలు, వృద్ధ జర్నలిస్ట్ లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పని చేస్తున్న అన్ని రంగాల వారు మరియు డిజిటల్ ప్రింట్ అండ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ లు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న నాన్ జర్నలిస్ట్ లు, సీనియర్ జర్నలిస్ట్ లు నడుపుతున్న వెబ్, యాప్, కేబుల్ ఛానల్, ప్రాముఖ్యత గల యూటూబ్ ఛానల్ జర్నలిస్ట్ లు, అన్ని కుల సంఘాల జర్నలిస్ట్ లకు ఈ సంఘం చేయూతతో పని చేసే ఏకైక సంఘంగా తీర్చి దిద్ది మా హక్కులు, మీ ఆశయ సాధన కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న జర్నలిస్ట్ సంఘాలు కేవలం కంటి తుడుపుగానే పని చేస్తున్నాయి. వాటి స్థానంలో బలమైన ట్రేడ్ యూనియన్ TPJU అందిస్తుంది. 

*ఈ క్రింది సమస్యలు మీ దృష్టికి తీసుకువస్తున్నాం.*
*తెలంగాణ జర్నలిస్ట్ ల సమస్యలు - పరిష్కార మార్గలు....*

1). ఆమోదం ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల గుర్తింపు కార్డుల ఆదారంగా ప్రభుత్వం అక్రీడెషన్స్ ఇవ్వాలి.

2) గత 9సంవత్సరాల క్రితం ప్రభుత్వం తెచ్చిన ఏం ప్యానల్ రద్దు  చేస్తూ, పాత పద్ధతిన మీడియా సంస్థల గుర్తింపు ఉండాలి.

3). దేశంలో కొన్ని రాష్ట్రలలో అమలు అవుతున్న జర్నలిస్ట్ ల కనీస వేతనం చట్టం అమలు, వృద్ధ జర్నలిస్ట్ లకు పెన్షన్, ఆరోగ్య, వ్యక్తిగత భీమా సౌకర్యం ఇవ్వాలి.

4) ప్రభుత్వ, ఆయా మీడియా సంస్థల భాగస్వామ్యంతో సంక్షేమ నిధి, ఈఎస్ఐ ఆరోగ్య సేవలు, భీమా సౌకర్యం కల్పించాలి.

5) మీడియా సంస్థలు బ్యాంక్ అక్కోంట్ ద్వారా వేతనం చెల్లించి, ఆయా సంస్థలు సాలరీ సర్టిఫికెట్ జారీ చేపించుట, తెలంగాణ వేజ్ బోర్డు పరిధిలోకి మీడియా సంస్థలను అన్ని తీసుకుని రావడం.

6) తెలంగాణ వ్యాపితంగా జర్నలిస్ట్ పిల్లలకు చదువు, ఇండ్ల స్థలం, ఇల్లు నిర్మాణం, ప్రభుత్వ పథకాల్లో మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి.

 7) తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో జర్నలిస్ట్ సంఘాల గుర్తింపు ఎన్నికలు ప్రభుత్వం బ్యాలెట్ ద్వారా నిర్వహించడం, విజయం సాధించిన సంఘాల ద్వారా రాష్ట్ర, జిల్లా అక్రి డెషన్ కమిటీల నిర్మాణం, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంక్షేమ పనులలో భాగస్వామ్యం కల్పించడం.

8) రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రెస్ క్లబ్ లు అన్ని సౌకర్యాలతో నిర్మాణం. ప్రస్తుతం జిల్లా,  రాష్ట్ర ప్రెస్ క్లబ్ లు ప్రభుత్వ పరంగా ఎన్నికలు జరిపిన తరువాత విజయం సాధించిన యూనియన్ వారికి అప్పగించుట.

9). ప్రెస్ అకాడమీని రద్దు చేసి తెలంగాణ ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్ట్ ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం. ప్రెస్ అకాడమిని జర్నలిస్ట్ సంక్షేమ బోర్డులో అకాడమీని పొందు పరచడం.

10). రాష్ట్ర వ్యాపితంగా అన్ని ప్రభుత్వం కార్యాలయాల్లో జర్నలిస్ట్ లు అడిగిన సమాచారం సత్వరం అందించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా ప్రవేశించడం...

11). మహిళా జర్నలిస్ట్ లకి, ఆయా మీడియా సంస్థల్లో పని చేసే  మహిళా సిబ్బందికి భద్రత, ప్రసూతి సెలవులు మరియు ఆయా మీడియా భవనాల్లో మహిళా జర్నలిస్ట్ సిబ్బందికి ప్రత్యేక సౌకర్యలు కల్పించుట.

12). తెలంగాణ రాష్ట్రంలో బస్సు, ట్రైన్ లలో ఉచిత ప్రయాణం. జాతీయ స్థాయిలో రెండు సార్లు జర్నలిస్ట్ కుటుంబాలకు ఉచిత ప్రయాణం.

13). జాతీయ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్ట్ నాన్ జర్నలిస్ట్ లకు పనిచేసే ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో సౌకర్యాలు కల్పించడం. వారికి స్వరాష్ట్రంలో కల్పించే అన్ని సౌకర్యలు,  గుర్తింపు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం.

14) తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ లలో ఉచిత క్యాంటిన్ భోజనం ఏర్పాటు చేయడం, ప్రభుత్వ అన్ని కార్యక్రమాల్లో జర్నలిస్ట్, నాన్ జర్నలిస్ట్ లకు వసతి, భోజనం ఏర్పాట్లు చేయడం.

15). జర్నలిస్ట్ సంక్షేమ బోర్డు ద్వారా  జర్నలిస్ట్ కుటుంబాలకు ఉపాధి, వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడం, జర్నలిస్ట్ లకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించడం.

16). తెలంగాణ రాష్ట్రంలో గత జర్నలిస్ట్ లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. దాడులు జరిగిన బాధిత జర్నలిస్ట్ లకు నష్టపరిహారం అందించుట.

17). తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్ట్ కుటుంబాలకువైద్యం కోసం ఆరోగ్య శ్రీ, జర్నలిస్ట్ సంక్షేమం నుండి కాని, డబ్బులు సరిపోని వారికి జర్నలిస్ట్ సంక్షేమ బోర్డు నుండి గ్రాంట్ ఇన్ ఎయిడ్ క్రింద అదనపు సహాయం అందించుట.

18). ప్రభుత్వ పరమైన అన్ని కార్యక్రమాలకు ఆయా శాఖలే వాహన, భోజన సదుపాయాలు ప్రభుత్వం భరించుట.

19). ప్రింట్ అయ్యే అన్ని పెద్ద పత్రికలతో పాటు చిన్న పత్రికలకు, అన్ని కేబుల్ ఛానల్స్ కు ప్రకటనలు ఇచ్చుట గురించి.

20).తెలంగాణలోని ప్రతి జర్నలిస్ట్ కు, నాన్ జర్నలిస్ట్ లకు ఆయా పని చేస్తున్న కేంద్రాల్లో ఇంటి స్థలం, పక్కా ఇల్లు మంజూరు ఈ సంవత్సరమే పూర్తి చేయుట.

21). జిల్లా కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ లకు స్వతంత్రంగా ప్రభుత్వ ఫీజు లేకుండా బార్ షాపుల మంజూరు చేయుట.

22). జర్నలిస్ట్ లపై దాడులు చేసిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయుట, పై కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వ్యవహరించుట. బాధితులకు రెవిన్యూ రికవరీ చట్టం ద్వారా దాడులకు పూనుకున్న వారి నుండి పరిహారం ఇప్పించుట.

23) అసెంబ్లీ, సచివాలయంలో మీడియా సెంటర్ ఏర్పాట్లు, వసతి సౌకర్యం ఏర్పాటు చేయుట.

24) జర్నలిస్ట్ సంక్షేమ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయుట,

25) మేడారం జాతరకు వచ్చే జాతీయ, రాష్ట్ర జర్నలిస్ట్ లకు ప్రత్యేక సౌకర్యం కల్పించుట.

26) రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలకు ఒక్కసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జర్నలిస్ట్ లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం.

*దయచేసి తమరు పై విషయాలు పరిశీలించి తెలంగాణ జర్నలిస్ట్ సమాజానికి మేలు చేయగలరని ప్రార్ధన.*

ఉద్యమాభినందనలతో....

మీ విశ్వాసపాత్రుడు.

(*డి. వై. గిరి*)
*(ఎం. శివ శంకర్ )*
కన్వీనర్స్ 
తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ (TPJU)
H. No : 1-2-597/27, 
ఒకటో అంతస్తు, అంబికా పెరల్స్ అండ్ జువెల్లర్స్ పైన, కట్ట మైసమ్మ గుడి ఎదురుగా, వాల్మీకి నగర్,
లోయర్ ట్యాంకు బండ్, హైదరాబాదు-500029

సెల్ :7013667743,9866535458

Views: 10
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News