సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!

- మృతదేహాన్ని రప్పించాల్సిందిగా కోటపాటికి వినతి

On
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!

ఇందూరు, ఫిబ్రవరి22, న్యూస్ ఇండియా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా గాంధారివాసి చాకలి పోశయ్య (48) సౌదీ అరేబియాలో రియాజ్ కు వెయ్యి  కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. గత అనేక సంవత్సరాలు  గా అక్కడే పని చేస్తున్నాడు. ఇటీవల రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి పది రోజుల క్రితం సౌదీ కి వెళ్ళిన పోశయ్య మనస్తాపంతో అతను ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అక్కడే పని చేస్తున్న మరొక వ్యక్తి నిన్నటి రోజున సమాచారం ఇచ్చాడు. పోశయ్య కు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. శోకసముద్రంలో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని సంప్రదించి స్థానిక BRS నాయకులు H తానాజీ రావు ను సంప్రదించగా, వారు B. B పాటిల్ M. P గారిని సంప్రదించి, అనంతరం మృతదేహాన్ని తెప్పించవలసిందిగా " ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక " అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడుని అభ్యర్థించి, సహాయపడవలసిందిగా కోరారు. కుటుంబ సభ్యులను ఆర్మూర్ కు పంపి కావలసిన పత్రాలు సమర్పించారు.  వెంటనే స్పందించిన కోటపాటి అటు సౌదీలోని ఇండియన్ ఎంబసీ, ఇటు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మెయిల్ పంపారు. సౌదీలోని కమ్యూనిటీ కోఆర్డినేటర్ సయ్యద్ అబు ఫరస్ గారికి మృతదేహాన్ని పంపడానికి అధికారం ఇస్తూ నియమించడం జరిగింది. త్వరలోనే మృతదేహాన్ని పూర్తి ఖర్చులు భరించి యజమాని పంపే విధంగా చర్యలు తీసుకుంటామని ఇండియన్ ఎంబాసి రియాద్ నుండి జవాబు పొందడం జరిగింది.

Views: 220
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం  ఏటుకూరి మునేశ్వరావు వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
ఖమ్మం ఫిబ్రవరి 28 ఖమ్మం న్యూస్: ఆర్‌.ఎం.పీ డాక్టర్‌గా ప్రజలకు అపార సేవలందించిన వనంవారి కృష్ణాపురం మహనీయుడు ఏటుకూరి మునేశ్వరావు పెద్ద కర్మ శనివారం రోజున జరిగింది...
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..
ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ 
కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ 
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.