విలువైన ప్రభుత్వ భూములను కాపాడలంటూ అధికారులకు ఆదేశం..
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీపై రిప్యూలో సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక..
వాసవిపై..
బిగుస్తున్న ఉచ్చు..!
సిరీస్ భూములపై సీఎం ఆరా..?
విలువైన ప్రభుత్వ భూములను
కాపాడలంటూ అధికారులకు ఆదేశం
15 రోజుల్లో అవినీతి అధికారుపై
విజిలెన్స్ సోదాలంటూ అల్టిమేటం..!
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీపై
రిప్యూలో సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
ఆందోళనలో కస్టమర్లు..!
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (న్యూస్ ఇండియా ప్రతినిధి): వాసవి ఆనంద నిలయంపై సర్కారు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్‌లో విలువైన సిరీస్ ఫార్మా కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన సర్కారు భూములపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. దీంతో శుక్రవారం హెచ్ఎండీఏ కార్యాలయంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీపై జరిపిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అవినీతి అధికారులపై 15 రోజుల్లో విజిలెన్స్ సోదాలు జరుపనున్నట్లు హెచ్చరించారు. విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని అల్టిమేటం జారీ చేశారు. దీంతో రివ్యూ మీటింగ్ తరువాత సిరీస్ ఫార్మా కంపెనీకి గతంలో ప్రభుత్వం కేటాయించిన సర్కారు భూముల వ్యవహారంపై అధికారులలో చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ప్రభుత్వంలోని పెద్దలకు మేలు చేసేందుకు కోట్లాది రూపాయల విలువైన భూములను అప్పనంగా శ్రీవైష్టో కంపెనీకి కట్టబెట్టిన పలువురు అధికారుల మెడకు ఈ వ్యవహారం చుట్టుకోనున్నట్లు గుసగులాడుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వేల కోట్ల విలువైన ఈ భూకుంభకోణంలో వాసవికి ఉచ్చు బిగిస్తుండడంతో కస్టమర్లలో ఆందోళన నెలకొందని చెప్పవచ్చు.
అక్రమ నిర్మాణాపై విచారణ చేపట్టాలి..
ఎల్బీనగర్‌లో సిరీస్ ఫార్మా కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణలపై విచారణ చేపట్టాలి. ఈ భూముల వ్యవహారంపై నిజా నిజాలు నిగ్గు తేల్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. సిరీస్ ఫార్మా కంపెనీ వల్ల భూగర్బ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. అయినా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు ముడుపులకు ఆశపడి అనుమతులు జారీ చేశారు. జ్యూయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా భూగర్బ పరీక్షలు నిర్వహించాలి. కానీ అధికారులు వీటిని పరిగణలోకి తీసుకోకుండా అక్రమ నిర్మాణాలకు పరిషన్లు ఇచ్చారు. ఇక గత ప్రభుత్వంలోని జిల్లా రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు వంత పాడుతూ ఎన్ఓసీలు జారీ చేశారు. వీటిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
బి. రాములుయాదవ్,
రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐబీఎఫ్)
--------------------------------------------------------
ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి..
సిరీస్ ఫార్మా కంపెనీకి కేటాయించిన సర్కారు భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. అడ్డదారుల్లో గతంలో ఎన్ఓసీ జారీ చేసిన అధికారులపై, అక్రమ నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కొనుగోలుదారులకు నష్టం జరుగకుండా ప్రభుత్వం వాసవి గ్రూప్ కంపెనీ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలి. లేని పక్షంలో బాధితులకు జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం.
పారంద స్వామి,
రాష్ట్ర ఉపాధ్యక్షులు,
తెలంగాణ అంబేద్కర్ సంఘం
---------------------------------------------------------
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి..
సిరీస్ ఫార్మా కంపెనీకి కేటాయించిన ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులకు వేల కోట్ల రూపాయల లబ్ధి చేసేందుకు గత ప్రభుత్వ పెద్దలకు సహకరించిన అధికారుపై కేసులు నమోదు చేయాలి. విలువైన సర్కారు భూములను స్వాధీనం చేసుకోవాలి. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సిరీస్ భూముల వ్యవహరంపై విచారణ చేపట్టి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలి.
ఎర్ర రవీందర్,
రాష్ట్ర అధ్యక్షులు
దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక
---------------------------------------------------------
Comment List