బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్
కరీంనగర్, ఫిబ్రవరి25, న్యూస్ ఇండియా ప్రతినిధి - కోక్కుల వంశీ
On
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ ( సుప్రజా) కుటుంబ సభ్యులతో అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనాలను సమర్పించి, కుటుంబ సభ్యులతో మొక్కులు తీర్చుకొని, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా యాక్టర్ నీతూ క్వీన్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం బొక్కల గుట్ట మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు. అలాగే ప్రజలందరూ సుఖ,సంతోషాలతో, పడి పంటలతో మైసమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకున్నారు.
Views: 174
Tags:
Comment List