కేసిఆర్ కధన భేరికి.. కదలి రండి..!

- వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు

On
కేసిఆర్ కధన భేరికి.. కదలి రండి..!

వేములవాడ, మార్చి11, న్యూస్ ఇండియా ప్రతినిధి

ఈ నెల12న  కరీంనగర్లో నిర్వహించే కథన బేరికి వేల సంఖ్యలో కదలి రావాలని వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం వేములవాడలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కెసిఆర్ బహిరంగ సభ కరీంనగర్లోని ఎస్ ఆర్ ఆర్ మైదానంలో సాయంత్రం నాలుగు గంటలకు ఉన్నందున. నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కదలి రావాలని పిలుపునిచ్చామన్నారు.

FB_IMG_1710160761606

పార్లమెంట్ ఎన్నిక తెలంగాణ బలం.. బలగం చూపే సమయం ఆసన్నమైందని... ఢిల్లీలో తమ గలం వినిపించాలంటే... పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కరీంనగర్ బహిరంగ సభకు ప్రతి మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తరలి వస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి,  రాఘవ రెడ్డి, బండ నర్సయ్య, రామతీర్థపు రాజు,  గడ్డం హనుమాన్లు,   మండలాల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య,  మల్యాల  దేవయ్య, గోసుకుల రవి, ,  ఎంపీపీలు బూర బాబు,   చంద్రయ్య గౌడ్,  జడ్పిటిసిలు ఏస తిరుపతి, మ్యకల రవి, సెస్ డైరెక్టర్ హరిచరన్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్,  కౌన్సిలర్లు నిమ్మాశెట్టి విజయ్, గోలి మహేష్, జోగిని శంకర్,  గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్, నాయకులు గంగం మహేష్, అర్ సి రావు, నరాల దేవేందర్, కమలాకర్ రెడ్డి,  వెంగళ శ్రీకాంత్ గౌడ్, సుంకపాక రాజు, అరుణ్ , సాయి, తదితరులు పాల్గొన్నారు.

Read More అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని జెబి ఇన్ ఫ్రా గ్రూప్ సూచన...

Views: 164
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News