పేదల భూ పోరాటంపై పోలీసుల దాష్టికం...

అనచివేతలతో భూ పోరాటాలను ఆపలేరు...

By Ramesh
On
పేదల భూ పోరాటంపై పోలీసుల దాష్టికం...

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్....

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 17 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

 

 జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామ శివారులో గల 174 సర్వేనెంబర్ భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఇండ్లులేని నిరుపేదలు సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుంటుంటే పోలీసులు అక్రమంగా, పోలీసు బలగాలతో పేద ప్రజలను చుట్టుముట్టి పేద ప్రజలపై పిడి గుద్దులు గుద్దుతూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సుంచు విజేందర్ ను బలవంతంగా ఈడ్చుకెళ్ళి పోలిస్ వ్యాన్లో పడేసి, ఆయనతోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి,నర్మెట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సాయంత్రం సొంత పూచికత్వం విడుదల చేశారు. ఈ సందర్భంగా సుంచు విజేందర్ మాట్లాడుతూ 174 సర్వే నెంబర్ లో ఉన్న 8 - 16 భూమి పై ఉన్న స్టేటస్కోను జిల్లా రెవిన్యూ కోర్ట్ రద్దుచేసి, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దని ,అట్టి భూమిని మండలంలోని ఇండ్లు లేని నిరుపేదలకు పంచాలని, దశలవారీగా పోరాటం చేసి చివరకు సిపిఎం ఆధ్వర్యంలో పేదలందరూ ఎర్రజెండాలు చేతపట్టి గుడిసెలు వేస్తున్న క్రమంలో పోలీసులు కర్కశంగా మహిళలపై మగ పోలీసులు విరుచుకుపడి పిడుగులు గుద్ది ప్రజలను చల్లా చెదురు చేసే ప్రయత్నం చేశారన్నారు. దీంతో పోలీసుల మధ్య పేదల మధ్య తోపులాట జరిగిందన్నారు. ఈ మండలంలో కొంతమంది భూ కబ్జాదారులు పట్టి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. అణచివేతలతో భూ పోరాటాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగిసిపడతాయి అన్నారు. పెదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ సిబ్బంది పోలీసులు తొలగించారు. గుడిసెలు తొలగించిన భూ పోరాటం ముందుకు పోతది తప్ప వెనక్కు తగ్గదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు రామగల్లా అశోక్, వెంకటవ్వ, భూ పోరాట కమిటీ కన్వీనర్ పర్వతం నర్సింలు, అన్న బోయిన రాజు, రాములు, రాజవ్వ, మనీ , ఎల్లయ్య, ఈదమ్మ ,శోభ, కరుణాకర్, బాలరాజు, యాదగిరి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.IMG-20240316-WA1316IMG-20240316-WA0983IMG-20240316-WA1345IMG-20240316-WA1344

Views: 295
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.