1039కి చేరిన పుస్తే మట్టెలా వితరణ..!
- నిరుపేద యువతి పెళ్లికి పుస్తె మట్టెల ప్రదానం చేసిన నేవురి వెంకట్ రెడ్డి మమత
On
వేములవాడ, మార్చి 17, న్యూస్ ఇండియా ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టు నాయక్ తండాలో దరవత్ రామ్ సింగ్ కూతురు, గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య ఇరువురి యువతుల పెళ్లికి ఆదివారం సామాజిక కార్యకర్త ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మమతలు సహకారంతో పుస్తే మట్టెలను ఎల్లారెడ్డిపేట మాజీ ఉపసర్పంచ్ ద్యాగం నారాయణ, రాహుల్,హైమద్ కలసి అందచేశారు.
ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డివారి తల్లిదండ్రు లైన కీర్తిశే షులు నేవూరి లక్ష్మీ మల్లారెడ్డిల జ్ఞాపకార్ధం ఇప్పటివరకు 1039 మంది నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెలు వితరణ చేశారు.
Read More ప్లాస్టిక్ నివారిద్దాం
Views: 30
Tags:
Comment List