తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్ లో వినిపించేది ఒక్క బీ.ఆర్.యస్ పార్టీనే

ఏ రోజు తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్ లో మన రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడలేదు

On
తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్ లో వినిపించేది ఒక్క బీ.ఆర్.యస్ పార్టీనే

- తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్ లో వినిపించేది ఒక్క బీ.ఆర్.యస్ పార్టీనే - ఏ రోజు తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్ లో మన రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడలేదు - పండిన వరి పంటకు రూ. 500/- బోనస్ ప్రభుత్వం ఇవ్వాలి - సాగునీరు, తాగునీరు కొరత లేకుండా అందించిన ఘనత కేసీఆర్ గారిది - ⁠ దేశం లో ఎక్కడా లేని విధంగా రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ - కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది - ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. - మరోసారి కారు గుర్తుపై ఓటేసి ఆశీర్వదించాలని ఉమ్మడి జిల్లా ప్రజలను కోరుతున్నా కొత్తగూడెం లో జరిగిన ప్రెస్ మీట్ లో ఎంపీ నామ నాగేశ్వరరావు, పాల్గొన్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం, 04 ఏప్రిల్ - తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్ లో వినిపించేది బీ.ఆర్.యస్ పార్టీనే అని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. గురువారం నాడు కొత్తగూడెం లోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తో కలసి ఆయన మాట్లాడారు. లోక్ సభ సమావేశాల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసింది బీ.ఆర్.యస్ పార్టీ ఎంపీలే అన్నారు. రాష్ట్రం లో బీజేపీ, కాంగ్రెస్ నుండి గెలిచిన ఎంపీలు ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం పార్లమెంట్ లో మాట్లాడలేదని అలాంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు తో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పండిన వరి పంటకు రూ.500/- రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. కేసీఆర్ పాలనలో సాగునీరు కొరత లేకుండా ప్రతి ఎకరాకు ఇచ్చామని అలానే తాగునీరు కొరత లేకుండా ప్రతి ఇంటికి ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు చెప్పిన మాయ మాటలు, మోసపు మాటలు ప్రజలు నమ్మి ఏదో చేస్తారు అని కాంగ్రెస్ కి ప్రజలు ఓట్లు వేశారు గెలిచిన తరువాత ప్రజలను ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటికే ప్రజల్లో, రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. గత వారం రోజులు గా నేను ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్న చాలా ప్రాంతాల్లో వరి ,మొక్క జొన్న పంటలు సాగునీరు అందక ఎండిపోయి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు అంతే కాకుండా కనీసం తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఉందన్నారు. సుమారు గా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కాంగ్రెస్ వంద రోజుల పాలనలోనే రైతులు సహా అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుండేది అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు భారత దేశం లోనే మరే రాష్ట్రం లో లేవన్నారు. బీ.ఆర్.యస్ ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు అందాయన్నారు. పార్లమెంట్ సాక్షిగా నేను కేంద్రాన్ని దేశం లో ఇంటింటికీ మంచినీరు ఇచ్చే రాష్ట్రం ఏది అని అడిగిన ప్రశ్నకు వారి తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇంటింటికి మంచి నీరు సరపరా చేస్తుందని తెలిపారని ఆది కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. అత్యధికంగా వరి ధాన్యం పండించిన రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే అన్నారు. వ్యవసాయ రంగం లో పంట వేసిన దగ్గర నుండి పంట వచ్చే వరుకు ఏం కావాలో ఇచ్చి రైతన్నలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. అలానే బడుగు, బలహీన వర్గాల గురించి కూడా ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. కేసీఆర్ పాలన పదేళ్ల లో మనం చేసిన అభివృద్ధి పనులు, ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటింటికి పార్టీ నాయకులు వెళ్లి వివరించాలని, అలానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత వారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన విధానం ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతం లో ఒక్క నేషనల్ హైవే కూడా ఉండేది కాదని నేను మొదటి సారి ఎంపీగా గెలిచిన తరువాత కేంద్రం పై పోరాడి జిల్లాలో ఉన్న రోడ్లను నేషనల్ హైవేలగా మార్చడం జరిగిందన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశం తో జిల్లాకు హైవే రోడ్లు కావాలని ,రైల్వే లైన్లు కావాలని కేంద్రం పై పొరాడి తీసుకురావడం జరిగిందని, అలానే భద్రాచలం నుండి కొవ్వూరు వరుకు రైల్వే లైన్ కోసం 120కి పైగా లేఖలు రాయడం తో పాటుగా కేంద్ర మంత్రులను కలసి మంజూరు చేపించడం జరిగిందని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రజలు మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.

Views: 34
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News